సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ కు చెందిన గూగుల్ పే ను చాలా మంది డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్నారు. అనేక మంది ఇందులో నగదు ట్రాన్స్‌ఫర్ కూడా చేస్తున్నారు. దీని ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్‌తోపాటు బిల్లులను చెల్లించవచ్చు. ఆన్‌లైన్ లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫోన్‌లకు రీచార్జి చేయవచ్చు. అయితే గూగుల్ పేను వాడొద్దనుకుంటే అందులో బ్యాంక్ ఖాతాను సులభంగా తొలగించవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
గూగుల్ పేలో బ్యాంక్ ఖాతాను తొలగించాలంటే ఇలా చేయాలి. స్టెప్ బై స్టెప్…
* మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ పే ను ఓపెన్ చేయండి.
* ఎడమ భాగంలో పైన ఉండే మీ ఫొటోపై ట్యాప్ చేయాలి.
* అనంతరం వచ్చే పేజీలో మీరు డిలీట్ చేయాలనుకునే బ్యాంక్ అకౌంట్‌పై ట్యాప్ చేయాలి.
* అక్కడ ఓ కొత్త పేజీ కనిపిస్తుంది. అందులో పై భాగంలో కుడివైపు ఉండే 3 చుక్కలపై ట్యాప్ చేయాలి.
* అక్కడ ఇచ్చిన ఆప్షన్ల లోంచి రిమూవ్ అకౌంట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఓ కొత్త పాపప్ విండో ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఆ బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం అయి ఉండే అన్ని యూపీఐ ఐడీలు డిలీట్ అవుతాయి.. అనే మెసేజ్‌ను చూపిస్తుంది.
* కంటిన్యూపై క్లిక్ చేయాలి. దీంతో గూగుల్ పేలో ఉన్న ఆ బ్యాంక్ అకౌంట్ తొలగించబడుతుంది.
గూగుల్ పే లో మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ను ఇలా చెక్ చేయాలి…
* మీ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ పేను ఓపెన్ చేయండి.
* ఎడమ వైపు పై భాగంలో ఉండే మీ ఫొటోపై ట్యాప్ చేయాలి. అనంతరం వచ్చే బ్యాంక్ అకౌంట్లలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకుని దానిపై ట్యాప్ చేయాలి.
* వ్యూ బ్యాలెన్స్ పై ట్యాప్ చేయాలి.
* మీ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాలి. దీంతో అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి.