భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారత్ చైనా కు చెందిన 59 యాప్ లను డిలీట్ చేసింది. ఆ యాప్ ల లిస్ట్ లో టిక్ టాక్ కూడా ఒకటి. టిక్ టాక్ యాప్ ను భారత దేశంలో ఎంతో మంది ఉపయోగించారు దాదాపుగా 20 కోట్ల ఉజర్లు టిక్ టాక్ ను వాడే వారు. ఇక ఇప్పుడు టిక్ టాక్ లేకపోవడంతో కొందరు తమకు వినోదం మిస్ అవుతుంది అని దిగులు పెట్టుకుంటున్నారట… వారికి టిక్ టాక్ తరహాలో వినోదాన్ని పంచే యాప్ లేకపోవడంతో ప్రత్యమ్నాయంగా ఏ యాప్ ఉంటుందో అని తెగ వెతుకుతున్నారు. వారికే ఈ న్యూస్…! టిక్ టాక్ లేకపోతే ఏంటి మీకు మేం ఉన్నాం అంటూ హైదరాబాదీ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ‘ఎం టచ్’ ల్యాబ్స్ అనే సంస్థ టిక్ టాక్ కు ప్రత్యామ్నాయ యాప్ ను డెవలప్ చేశారు ఆ యాప్ పేరే ‘’డబ్ షూట్’’. టిక్ టాక్ లో ఉండే అన్నీ ఫీచర్లు ఈ యాప్ లో ఉంటాయి ప్రజలకు వినోదాన్ని పంచడంలో ఈ యాప్ వెనకడుగు వేయదు అని చెబుతున్నారు సంస్థ సిఈఓ వేంకటేశ్వర రావు. గత వారం రోజులుగా డౌన్ లోడ్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.