జియో మార్ట్ సేవ‌లు షురూ.. వాట్సాప్‌లో ఆర్డ‌ర్ చేస్తే ఇంటికే స‌రుకులు..!

-

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియోలో ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను రూ.44వేల కోట్ల‌కు కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌తో క‌లిసి జియో.. జియోమార్ట్ సేవ‌ల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. ఇక చెప్పిన‌ట్లుగానే జియో ఆ సేవ‌ల‌ను ప్రారంభించింది. ప్ర‌స్తుతం జియోమార్ట్ సేవ‌లు థానె, న‌వీ ముంబై, క‌ల్యాణ్ ప్రాంతాల్లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి.

jio mart started services in selected areas can orders groceries on whatsapp

జియోమార్ట్ సేవ‌ల‌ను ఉప‌యోగించేందుకు గాను వినియోగదారులు +91 88500 08000 అనే నంబ‌ర్‌ను త‌మ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. అనంత‌రం వాట్సాప్‌లో ఆ నంబ‌ర్‌కు Hi అని మెసేజ్ పంపాలి. దీంతో జియో మార్ట్ సేవ‌ల‌ను క‌స్ట‌మ‌ర్లు ఉపయోగించుకోవ‌చ్చు. ఆ త‌రువాత వ‌చ్చే ఆటోమేటిక్ రెస్పాన్స్ మెసేజ్ సిస్టం ద్వారా వినియోగ‌దారులు త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేయాలి. ఈ క్ర‌మంలో స్థానికంగా ఉన్న జియో మార్ట్ కిరాణా షాపు వారు ఆ ఆర్డ‌ర్‌ను స్వీక‌రించి 48 గంట‌ల్లోగా ప్రాసెస్ చేస్తారు. క‌స్ట‌మ‌ర్లు ఆర్డ‌ర్ చేసిన స‌రుకుల‌ను 48 గంట‌ల్లోగా వారి ఇంటికే డెలివ‌రీ చేస్తారు. ఇలా జియో మార్ట్ ప‌నిచేస్తుంది.

జియో మార్ట్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకునేందుకు గాను క‌స్ట‌మ‌ర్లు ముందుగా త‌మ పేరు, చిరునామా, ఫోన్ నంబ‌ర్ త‌దిత‌ర వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ త‌రువాత త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. ఇక నిత్యం సాయంత్రం 5 గంట‌ల లోపు చేసిన ఆర్డ‌ర్ల‌కు ఆ త‌రువాతి 48 గంట‌ల్లోగా డెలివ‌రీ ప్రాసెస్ చేస్తారు. లేదా.. క‌స్ట‌మ‌ర్లు స్టోర్‌ల‌లోనే త‌మ స‌రుకుల‌ను పిక‌ప్ చేసుకోవ‌చ్చు. అయితే ప్ర‌స్తుతం ప‌లు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్ర‌మే హోం డెలివ‌రీ సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిసింది. ఇక జియో మార్ట్ సేవ‌ల‌ను త్వ‌ర‌లోనే దేశవ్యాప్తంగా అందివ్వ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news