జియో గుడ్‌ న్యూస్‌.. రూ. 25 లక్షల ప్రైజ్‌ మనీతో ఈ–కాంటెస్ట్‌!

Join Our Community
follow manalokam on social media

మొబైల్‌ గేమర్స్‌కు జియో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రూ.25 లక్షల ప్రైజ్‌ మనీతో ఈ కాంటెస్ట్‌ను నిర్వహించనుంది. చి‹స³ తయారీ సంస ్థక్వాల్‌కమ్‌ పార్టనర్‌షిప్‌తో జియో, జియో గేమ్స్‌ ఎస్పోర్ట్స్‌ వేదికగా ఆన్‌లైన్‌ షూటింగ్‌ గేమ్‌ కాల్‌ ఆఫ్‌ డ్యూటీ మొబైల్‌ ఏసెస్‌ ఎస్పోర్ట్స్‌ ఛాలెంజ్‌ను హోస్ట్‌ చేస్తున్నట్లు తెలిపింది.
ఈ గేమ్‌ మన దేశంలో నిషేధించిన పబ్‌జీకి పోటీగా వస్తోంది.


Qualcomm CDMA Technologies Asia Pacific Pte (QCTAP), జియో మొదటి ఈ కాంటెస్ట్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఈ కాంటెకస్ట్‌ ప్రైజ్‌ మనీని రూ.25 లక్షలుగా ప్రకటించింది. దీనికి జియో, నాన్‌ జియో వినియోగదారులు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. క్వాల్‌కమ్‌ అధ్యక్షుడు రాజన్‌ వాగాడియా మాట్లాడుతూ మొబైల్‌ గేమింగ్‌ మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
దాదాపు 90 శాతం మంది మొబైల్‌ను గేమింగ్‌ కోసం ప్రైమరీ డివైజ్‌గా వాడుతున్నారు. సింగిల్‌గా కాకుండా గ్రూప్‌గా కూడా ఈ టోర్నమెంట్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. సోలో రిజిస్ట్రేషన్ల నమోదు ఏప్రిల్‌ 11న ముగియనుందని, టీమ్‌ రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ 30న ముగియనుందన్నారు. దీనికి క్వాల్‌కం స్నాప్‌ డ్రాగన్, జియో గేమ్స్‌ ట్రైనింగ్‌లాగా గేమర్లకు ప్లాట్‌ఫాంను సృష్టించడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రొఫెషనల్‌ స్థాయి అవకాశాలను అందుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.

రిజిస్ట్రేషన్‌ లింక్‌: https://play.jiogames.com/esports/#/
ఎలాంటి రిజిస్ట్రేషన్, పార్టిసిపేషన్‌ ఫీజు లేదని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ టోర్నమెంట్‌ అర్హులు జూన్‌ 11, 2021న జరగనుండగా.. ఫైనల్స్‌ జూన్‌ 20, 2021న జరగనున్నాయి. భారతదేశంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ విస్తరణ పెరుగుతున్న కొద్దీ, మొబైల్‌ ఇస్పోర్ట్‌లకు పెరుగుతున్న డిమాండ్‌కు స్పందించడానికి ఇది జియో తాజా ప్రయత్నం . దీని అంతిమ లక్ష్యం గేమర్స్‌ కోసం మరిన్ని అవకాశాలను సృష్టించడం, లైవ్‌ స్ట్రీమ్‌ల ద్వారా గేమింగ్‌ కమ్యూనిటీలో మంచి భాగస్వామ్యం, నాణ్యమైన కంటెంట్‌ను ప్రారంభించడం అదేవిధంగా తదుపరి స్థాయి గేమింగ్‌ ప్రతిభను అంతర్జాతీయంగా పోటీ చేసి, గెలవడానికి వీలు కల్పించడం. భారతీయ గేమర్స్‌ కోసం మెరుగైన, మంచి గేమింగ్‌ అనుభవాన్ని అందించడానికి జియో గేమ్స్, క్వాల్‌కమ్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మొబైల్‌ గేమర్స్‌ అయితే వెంటనే రిజిస్ట్రేషన్‌ నమోదు చేసుకోండి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...