టెక్నాలజీ వేగంగా మారుతోంది. అనేక విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. దీంతో మనకు ప్రతి పనీ చాలా సులభతరం అవుతోంది. ఈ క్రమంలోనే మనం అనేక రకాల అధునాతన గ్యాడ్జెట్లను రోజూ వాడుతున్నాం. అయితే మనకు అనారోగ్య సమస్యలు కూడా తరచూ వస్తుంటాయి. కనుక ప్రతి ఒక్కరూ ఇంట్లో కింద తెలిపిన మెడికల్ గ్యాడ్జెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. దీంతో మనం ఆరోగ్యంగా ఉండేందుకు, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవి ఉపకరిస్తాయి. మరి ఆ గ్యాడ్జెట్లు ఏమిటంటే…
1. పోర్టబుల్ ఈసీజీ మానిటర్
ఈ మెషిన్‌ను కచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి. ఇది స్మార్ట్ ఫోన్ యాప్ సహాయంతో పనిచేస్తుంది. దీంతో స్మార్ట్‌వాచ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో హార్ట్ రేట్‌ను చెక్ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను కలవవచ్చు.
2. బీపీ మెషిన్
బీపీ అనేది మనకు పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. కనుక దాన్ని పరీక్షించుకోవాలి. అయితే ఎప్పుడూ హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ బీపీ మెషిన్‌ను పెట్టుకుంటే దాంతో సులభంగా బీపీని కొలవవచ్చు. అసాధారణంగా బీపీ ఉంటే వైద్యున్ని వెంటనే సంప్రదించవచ్చు.
3. పల్స్ ఆక్సీమీటర్
దీని సహాయంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. కరోనా సమయం కనుక ప్రతి ఒక్కరూ దీన్ని కచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి.
4. గ్లూకో మీటర్
రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో ఇది తెలియజేస్తుంది. కేవలం షుగర్ పేషెంట్లు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ దీన్ని వాడాలి. ఎప్పటికప్పుడు షుగర్ చెక్ చేసుకోవాలి. దీంతో షుగర్ వచ్చేది తెలుస్తుంది. వెంటనే షుగర్‌ను తగ్గించేందుకు చికిత్సను తీసుకోవచ్చు.
5. కాంటాక్ట్‌లెస్ ఐఆర్ థర్మామీటర్
నిన్నమొన్నటి వరకు సాధారణ థర్మామీటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు కాంటాక్ట్‌లెస్ ఐఆర్ థర్మామీటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో వ్యక్తులను తాకకుండానే వారి ఉష్ణోగ్రతలను తెలుసుకోవచ్చు. ఇంట్లో దీన్ని పెట్టుకుంటే జ్వరం వచ్చినప్పుడు ఉపకరిస్తుంది.
6. మెడికల్ అలర్ట్ సిస్టమ్
ఇంట్లో మెడికల్ అలర్ట్ సిస్టమ్‌ను పెట్టుకుంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఒక బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు, అందరూ అలర్ట్ అవుతారు. బాధితులను సకాలంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లవచ్చు. అందువల్ల దీన్ని కూడా అందరూ ఇళ్లలో పెట్టుకోవాలి.