యూట్యూబ్ యాప్ లో కీలక మార్పులు..!

-

ఎక్కువగా మనం యూట్యూబ్ లో వివిధ రకాల వీడియోలని చూస్తూ ఉంటాం. అయితే సాధారణంగా యాప్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. అలానే యూట్యూబ్ లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. అయితే మరి యాప్‌లో వచ్చిన మార్పులని చూద్దాం. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (IOS) యాప్‌ యూజర్ ఇంటర్ఫేస్ (UI) లో కొత్త ఫీచర్లను తీసుకు రావడం జరిగింది. అయితే ఈ ఫీచర్ అందరికీ కూడా బాగా ఉపయోగకరంగా ఉండనుంది.

 

వీడియోని మినిమైజ్ చెయ్యక్కర్లేకుండానే మనం వీడియోని లైక్ చెయ్యచ్చు. అలానే డిస్‌లైక్ కూడా చెయ్యచ్చు. అలానే వీడియో ప్లేయర్ యూఐలోనే సేవ్ టూ ప్లే లిస్ట్, షేర్ అనే బటన్లు కూడా ఉంటాయి. ఇవి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇప్పటి దాకా అయితే లైక్ చేయాలన్నా, కామెంట్ చేయాలన్నా ఫుల్ స్క్రీన్ నుంచి మినిమైజ్ చేయాల్సి వచ్చేది.

కానీ ఇక అలా కాదు. కొత్త యూఐ రావడంతో ఫుల్ స్క్రీన్‌ ఉండగానే వీడియోలకు కామెంట్లు చేయవచ్చు. అలాగే లైక్, డిస్‌లైక్ చేయవచ్చు. షేరింగ్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్స్ ఆండ్రాయిడ్, ఓఐఎస్ యూట్యూబ్ యాప్‌కు యాడ్ అయ్యాయి. ఒకసారి కావాలంటే ఈ ఫోన్ లో చూడండి. అప్పుడు క్లియర్ గా మీరు అర్ధం అవుతుంది.

యాప్ అప్‌డేట్ చేసుకుంటే ఈ మార్పులు వస్తాయి. ఇది ఇలా ఉండగా యూట్యూబ్ ప్రీమియమ్, యూట్యూబ్ మ్యూజిక్ కోసం వార్షిక ప్లాన్‌లను తీసుకు రావడం జరిగింది. బెస్ట్ వాల్యూ ఆఫర్‌గా సంవత్సరం ప్లాన్‌ను రూ.1,290కు అందుబాటులోకి తెచ్చింది. నెల ప్లాన్ ధర రూ.139 ఉండగా..మూడు నెలల ప్లాన్ ధర రూ.399గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version