ఏకర్ ప్రెడేటర్ హేలియోస్ లాప్టాప్ 300 ఫీచర్లు, ధర మొదలైన వివరాలివే..!

-

మీరు ఏమైనా మంచి గేమింగ్ లాప్టాప్ గురించి చూస్తున్నారా..? అయితే అదిరే ఫీచర్స్ ఉన్న Acer Predator Helios 300 ల్యాప్‌టాప్ గురించి కూడా చూడాల్సిందే. ఈ లాప్టాప్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. పైగా మంచి గేమింగ్ లాప్టాప్ అని చెప్పచ్చు. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. 360Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో ఇది భారతదేశపు మొట్టమొదటి గేమింగ్ ల్యాప్‌టాప్. 11వ Gen Intel కోర్ i9-11900H ప్రాసెసర్‌తో దీనిని రూపొందించారు.

 

అలానే ఈ లాప్టాప్ gen AeroBlade 3D fan ఫ్యాన్ టెక్నాలజీతో వస్తోంది. ఇక ఈ లాప్టాప్ స్టోరేజ్ గురించి చూస్తే.. 6GB DDR6 Nvidia GeForce RTX 3060 GPUని కలిగి ఉంది ఇది. 16GB RAM సామర్థ్యంతో పనిచేస్తుంది, దీనిని 32GB వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i9-11900H CPUతో ఫిక్స్ చేసారు. 15.6-అంగుళాల FHD IPS LED-బ్యాక్‌లిట్ TFT LCD డిస్‌ప్లేను కలిగి ఉంది ఇది.

దీని పిక్సెల్ రిజల్యూషన్ 1920×1080, రిఫ్రెష్ రేట్ 360hz ,మాక్సిమం బ్రైట్ నెస్ 300 నిట్స్. డ్యూయల్ స్పీకర్స్ వున్నాయి. అలానే బ్లూటూత్ 5.1, HDMI పోర్ట్, USB 3.2 Gen 1 పోర్ట్, USB 3.2 Gen 2 పోర్ట్, USB టైప్-C థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లను కలిగి ఉంది.

720P వెబ్‌క్యామ్ ఉంది. ఇది 59whr బ్యాటరీని కలిగి ఉంది. ప్రిడేటర్ హీలియోస్ 300 ఇంటెల్ కిల్లర్ E2600 ఈథర్నెట్ కంట్రోలర్, కిల్లర్ Wi-Fi 6 AX1650i మోడెమ్‌తో వస్తుంది. Acer గేమింగ్ ల్యాప్‌టాప్ ధర రూ. 1,44,999.

Read more RELATED
Recommended to you

Latest news