Osmania University : 746.32 కోట్ల‌తో ఓయూ బ‌డ్జెట్

-

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీ.. రాబోయే వార్షిక సంవ‌త్స‌రానికి గాను బ‌డ్జెట్ ను కేటాయించింది. 746.32 కోట్లతో ఓయూ వార్షిక బడ్జెట్ ను కేటాయించారు. అయితే ప్ర‌స్తుతం అందుబాటులో 708.76 కోట్లు మాత్ర‌మే ఉన్నాయి. 37.56 కోట్ల లోటు బడ్జెట్ తో ఉంది. అయితే అన‌ప‌పు బ్లాక్ గ్రాంట్ ల కోసం ఓయూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం కోరింది. కాగ ఈ బ‌డ్జెట్ మొత్తంలో దాదాపు 54 శాతం అంటే.. 406.53 కోట్లు టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల‌కు జీతాల కోసం కేటాయించారు.

అలాగే 38.3 శాతం అంటే.. రూ.  285 కోట్లు పెన్షన్‌ల కోసం వినియోగించ‌నున్నారు. అలాగే 7.8 శాతం అంటే.. 54.79 కోట్లు ఉద్యోగులకు ఆకస్మిక మరణాలు, రుణాల కోసం కేటాయించారు. అలాగే యూనివర్శిటీ సిబ్బందికి జీతాల చెల్లింపు కోసం ఓయూ పరీక్ష ఫీజు ఫండ్ ఖాతా నుంచి ఓయూ ఫండ్ ఖాతాకు రూ. 130 కోట్లు బదిలీ చేశారు.

పెన్షన్ కార్పస్ ఫండ్‌కు విరాళంగా రూ. 5.0 కోట్లు కేటాయించారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో మీడియా పాయింట్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో  రాత్రి 8.00 నుంచి ఉదయం 6.00 గంటల మధ్య ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news