ఇన్ఫినిక్స్ ఇన్బుక్ ఎక్స్1 స్లిమ్ ల్యాప్ టాప్ లాంచ్.. ధర, ఫీచర్స్..

-

ఇన్ఫినిక్స్ ఇన్బుక్ ఎక్స్1 స్లిమ్ ల్యాప్ టాప్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇన్బుక్ ఎక్స్1కు సక్సెసర్గా కొత్త ల్యాప్టాప్ను ఇన్ఫినిక్స్ తీసుకొచ్చింది. 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3, ఐ5, ఐ7 ప్రాసెసర్ వేరియంట్లలో ఇన్ఫినిక్స్ ఇన్బుక్ ఎక్స్1 భారత మార్కెట్లోకి వచ్చింది…ఈ ల్యాప్ టాప్ గతంలో వచ్చిన వాటి కన్నా తక్కువ బరువుతో ఉంటాయి. దూర ప్రాంతాలకు కూడా సులువుగా క్యారీ చేయవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఈ ల్యాప్ టాప్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్స్..

14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ ల్యాప్‌టాప్‌ వస్తోంది. 300 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్ ఉంటుంది. 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3, కోర్ ఐ5, కోర్ ఐ7 ప్రాసెసర్‌ వేరియంట్లు లాంచ్ అయ్యాయి. అల్యూమినియమ్ బేస్డ్ మెటల్ బాడీని ఈ ల్యాప్‌టాప్‌ కలిగి ఉంది. బరువు 1.24కేజీలుగా ఉంటుంది. 14.8 మిల్లీమీటర్ల మందం ఉంది. ఎక్కువ సేపు వాడినా ల్యాప్‌టాప్‌ హీట్ కంట్రోల్ అయ్యేలా ఐస్ స్ట్రోమ్ 1.0 కూలింగ్ సిస్టమ్‌ను ఇన్ఫినిక్స్ ఈ ల్యాప్‌టాప్‌లో ఇస్తోంది.
Infinix InBook X1 Slim ల్యాప్‌టాప్‌లో 50Wh బ్యాటరీ ఉంది. 65వాట్ల ఫాస్ట్ చార్జర్‌ను ఇన్ఫినిక్స్ ఇస్తోంది. ఫుల్ చార్జ్‌పై నిరంతరాయంగా 9 గంటల ప్లేబ్యాక్ ఇస్తుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది. అన్ని వేరియంట్లు కూడా రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌లు, ఓ హెచ్‌డీఎంఐ 1.4 పోర్ట్, కార్డ్ రీడర్ స్లాట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉన్నాయి.వీడియో కాల్స్ కోసం డ్యుయల్ స్టార్ లైట్‌తో కూడిన హెచ్‌డీ వెబ్‌క్యామ్ ఉంటుంది.

ధర..

ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్.. స్టార్ ఫాల్ గ్రే, కాస్మిక్ బ్లూ, ఆరా గ్రీన్, నోబుల్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తుంది.
విభిన్నమైన కన్ఫిగరేషన్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను ఇన్ఫినిక్స్ తీసుకొచ్చింది. వాటి ధరలు ఇవే.
ఇంటెల్ కోర్ ఐ3 (8జీబీ ర్యామ్+256 SSD స్టోరేజ్) – రూ.29,990,ఇంటెల్ కోర్ ఐ3 (8జీబీ ర్యామ్+512 SSD స్టోరేజ్) – రూ.32,990,ఇంటెల్ కోర్ ఐ5 (8జీబీ ర్యామ్+512 SSD స్టోరేజ్) – రూ.39,990,ఇంటెల్ కోర్ ఐ5 (16జీబీ ర్యామ్+512 SSD స్టోరేజ్) – రూ.44,990,ఇంటెల్ కోర్ ఐ7 (16జీబీ ర్యామ్+512 SSD స్టోరేజ్) – రూ.49,990,ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో Infinix InBook X1 Slim సేల్‌కు వస్తుంది..యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా కొంటే ఇంకా మంచి బెనిఫిట్స్ 3 వేల వరకూ తగ్గింపు ఉంటుంది..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version