ఇండియాలో లాంచ్‌ అయిన Nokia X30 5G..

-

నోకియా ఎక్స్30 5జీ మొబైల్ ఇండియాలో లాంచ్‌ అయింది. గతేడాది గ్లోబల్‍గా విడుదలైన ఈ ఫోన్‌ను ఇప్పుడు భారత్‍లో విడుదల చేశారు. దీని కాస్ట్‌ కూడా ఎక్కువే.. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తోంది. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

నోకియా ఎక్స్30 5G స్పెసిఫికేషన్లు..

6.43 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో నోకియా ఎక్స్30 5జీ వస్తోంది.
90Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంది.
ఆండ్రాయిడ్ 12 ఓఎస్‍తో ఈ మొబైల్ అడుగుపెట్టింది.
నోకియా ఎక్స్30 5జీ వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‍(OIS)కు సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి.
బ్యాక్ కెమెరా సెటప్‍కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు నోకియా ఇచ్చింది.
Nokia X30 5G ఫోన్‍లో 4,200mAh బ్యాటరీ ఉంటుంది.
33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.
5జీ, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్‍సీ, బ్లూటూత్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్‍ను ఈ నోకియా మొబైల్ కలిగి ఉంది.
మొత్తంగా Nokia X30 5G మొబైల్ బరువు 185 గ్రాములుగా ఉంది.

నోకియా ఎక్స్30 5జీ ధర, సేల్

8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న నోకియా ఎక్స్30 5జీ ఫోన్ ధర రూ.48,999గా ఉంది.
క్లౌడీ బ్లూ, ఐస్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. అమెజాన్‍తో పాటు నోకియా వెబ్‍సైట్‍లో ఈ మొబైల్ ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి.
ఈ మొబైల్ ఓపెన్ సేల్‍ ఈ నెల 20వ తేదీన ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news