త్వరలో లాంచ్‌కు రెడీ అయిన Vivo X90 Pro Plus..!

-

వీవో నుంచి వరుసగా ఫోన్స్‌ రిలీజ్‌ అవుతూనే ఉన్నాయి.. తాజాగా మరో కొత్త స్మార్ట్ లాంచ్‌కు రెడీ అయింది. వివో (Vivo) ఎక్స్90 ప్రో ప్లస్ మోడల్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. చైనాలో డిసెంబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉండొచ్చని అంచనా.. లీకుల ఆధారంగా చూస్తే ఫోన్‌ ఫీచర్స్‌ ఇలా ఉన్నాయి..
ఇంచ్ కెమెరా సెన్సార్, వివో కొత్త వీ2 ఐఎస్‌పీ చిప్ వంటి ఫీచర్లు ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటి ద్వారా ఫోన్ ఎలా ఉండబోతోందో తెలుస్తోంది.
లెదర్ రెడ్ మోడల్‌ ఫోన్ కనిపిస్తోంది. జీస్ బ్రాండింగ్ పేరు ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోనీ ఐఎంఎక్స్ 989వీ ఇమేజ్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. అలాగే కెమెరాలో 100 ఎక్స్ జూమ్ వరకు కెపాసిటీ ఉండొచ్చు. క్వాడ్ రియర్ కెమెరా వ్యవస్థను కూడా గమనించొచ్చు. అలాగే ఫ్యాన్సీ టెక్చర్డ్ రియర్ ప్యానెల్‌ ఉంది. టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ఈ ఫోటోలను షేర్ చేశారు.
అంతేకాకుండా గత నెలలో కూడా వివో ఎక్స్ 90 ప్రో ప్లస్ ఫోటోలు కొన్ని ఆన్‌లైన్‌లో తెగ చెక్కర్లు కొట్టాయి. మెరుగైన కెమెరా వ్యవస్థ ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉండొచ్చు.. డ్యూయెల్ టోన్ రియర్ ప్యానెల్ ఉండొచ్చు. వివో ఎక్స్80 లైనప్‌లో కూడా ఇదే ఫీచర్ ఉంది. పవర్ బటన్స్, వాల్యూమ్ బటన్స్ ఫోన్ కుడి వైపున ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి..
వచ్చే నెలలో ఫోన్ మార్కెట్‌లోకి వస్తే.. ఏ ఏ ఫీచర్లు ఉన్నాయో పూర్తిగా తెలిసిపోతుంది. తొలిగా చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సంక్రాంతి సమయంలో ఈ ఫోన్ మన మార్కెట్‌లోకి రావొచ్చనమాట…

Read more RELATED
Recommended to you

Latest news