చైనాలో లాంచ్‌ అయిన One Plus Ace Pro స్మార్ట్‌ ఫోన్..!

-

వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ చైనాలో లాంచ్‌ అయింది. అదే One Plus Ace Pro స్మార్ట్ ఫోన్. మనదేశంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 10టీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది. ఇంకెందుకు ఆలస్యం..స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా.!
 వన్‌ప్లస్ ఏస్ ప్రో ధర..
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,499 యువాన్లుగా అంటే సుమారు రూ.41,200గా ఉంది. ఇక 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,799 యువాన్లుగానూ అంటే సుమారు రూ.44,800గా ఉంది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 యువాన్లుగానూ అంటే సుమారు రూ.50,700గా కంపెనీ నిర్ణయించారు.
వన్‌ప్లస్ ఏస్ ప్రో స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ ఏస్ ప్రో పని చేయనుంది.
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. 10 బిట్ కలర్ డెప్త్, హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు.
4జీ ఎల్టీఈ, 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు.
బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది.
150W సూపర్‌వూక్ ఎండ్యూరన్స్ ఎడిషన్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 19 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది.
దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.
కెమెరా క్వాలిటీ..
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను వన్‌ప్లస్ అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news