షావోమీ నుంచి లాంచ్‌ అయిన షావోమీ మిక్స్ ఫోల్డ్ 2.. 

-

షావోమీ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది. దీని ధర మాములుగా లేదు..రూ. లక్ష పైనే ఉంది. అదే షావోమీ మిక్స్‌ ఫోల్డ్‌ 2 స్మార్ట్‌ ఫోన్‌. ఫోన్‌ విశేషాలు ఇలా ఉన్నాయి.
షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 ధర..
ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 యువాన్లుగా అంటే సుమారు రూ.1,06,200గా ఉంది.
12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లుగానూ సుమారు రూ.1,18,000గా నిర్ణయించారు.
12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 11,999 యువాన్లుగానూ అంటే సుమారు రూ.1,41,600గా ఉంది.
మూన్ షాడో బ్లాక్, స్టార్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ ఫోల్డ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
5జీని ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 8.02 అంగుళాల మెయిన్ ఎల్టీపీవో 2.0 ఫోల్డింగ్ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
స్క్రీన్ రిజల్యూషన్ 2,160×1,914 పిక్సెల్స్‌గా ఉంది. అవుటర్ డిస్‌ప్లేగా 6.56 అంగుళాల ఈ5 అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది.
బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే… 
ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించారు. వెనకవైపు కెమెరా సెటప్‌ను సమాంతరంగా అందించారు. ఈ ఫోన్ బరువు 262 గ్రాములుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news