వచ్చే ఏడాది నుంచి వాట్సప్‌లో కొత్త ఫీచర్స్.. లాస్ట్‌సీన్‌ సెలక్టెడ్‌ కాంటాక్ట్స్‌కే పెట్టుకోవచ్చట!

ఇప్పుడు వాట్సప్‌ మన డైలీ రోటీన్‌లో భాగం అయిపోయింది. ఫ్రెండ్స్‌ నుంచి..ఆఫీస్‌ డిస్కషన్స్‌ వరకూ అన్నీ వాట్సప్‌లోనే చేస్తున్నాం..వాట్సప్‌ తరహా ఉన్న ఇతర యాప్స్‌ పోటీని తట్టుకుని స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో వాట్సప్‌ తనదైన శైలిలో ముందుకెళ్తుంది. ఈ మధ్యనే కొన్ని ఆసక్తికర ఫీచర్స్‌ను అందించిన వాట్సప్‌ తన యూజర్ల కోసం వచ్చే ఏడాది నుంచి కొన్ని కొత్త పీచర్స్‌ను అందుబాటులోకి తెస్తుంది. 2022లో రాబోయే కొత్త ఫీచర్స్‌ ఏంటో మీరు ఓ లుక్కేయండి!

whatsapp

New Time Limit for Disappearing Messages: ఆల్రడీ వాట్సప్‌లో మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ కావడానికి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే అందులో 7 రోజుల వరకే టైమ్ ఉంది.. త్వరలో ఈ టైమ్ లిమిట్‌ను 90 రోజులకు పెంచనుంది వాట్సప్.

Last seen for select users: ఇప్పటివరకూ లాస్ట్‌సీన్‌ పై మూడు ఆప్షన్స్‌ మాత్రమే ఉన్నాయి. ఉంటే కాంటాక్ట్స్ అందరికి, లేకుంటే ఎవ్రీవన్‌ అదికాకుండే నోబడి. ఒక సెట్టింగ్ మారిస్తే అవతలివారికి లాస్ట్ సీన్ కనిపించదు. ఇకపై కొందరు యూజర్లకు మాత్రమే లాస్ట్ సీన్ కనిపించేలా చేయొచ్చు. అంటే సెలెక్టెడ్ కాంటాక్ట్స్‌కి లాస్ట్ సీన్ కనిపించకుండా చేయొచ్చు. అవును ఈ ఫీచర్‌ నిజంగా సూపర్‌ ఉంటుంది..చాలామంది…కొందరికి కనిపించకుండా చేయాలని మొత్తానికే లాస్ట్‌సీన్‌ హైడ్‌ చేస్తున్నారు..అలాంటి వారికి ఇది బాగా ఉపయోగడుతుంది.

Message Reactions: ఈ ఫీచర్‌కోసం యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎవరైనా పంపిన వాట్సప్ మెసేజ్‌కు ఎమొజీ ద్వారా రియాక్షన్ ఇవ్వొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఈ ఫీచర్ ఉంది. అలాంటి ఫీచర్‌ వాట్సప్‌లో కూడా వస్తే అన్నిసార్లు మెసేజ్‌కి రిప్లైయ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు అవతల వాళ్లు ఏమనుకుంటారో అని రిప్లైయ్‌ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలా ఏదో ఒక రియాక్షన్‌ క్లిక్‌ చేస్తే ఓ పనైపోతుంది.

Sticker Maker for Mobile App: వాట్సప్‌లో స్టిక్కర్స్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నాం కదా…. వాట్సప్ వెబ్‌లో ఇప్పటికే స్టిక్కర్ మేకర్ ఫీచర్ వచ్చింది. త్వరలోనే వాట్సప్ మొబైల్ యాప్‌లో కూడా స్టిక్కర్ మేకర్ ఫీచర్ రాబోతోందట. ఈ ఫీచర్ వస్తే వాట్సప్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి స్టిక్కర్లు తయారు చేయొచ్చు.

Communities: గ్రూప్ ఛాట్స్‌ని స్ట్రీమ్‌లైన్ చేసేందుకు కమ్యూనిటీ ఫీచర్ రూపొందిస్తున్నట్టు వాట్సప్ వెల్లడించింది. ఇప్పటికే డిస్కార్డ్ యాప్‌లో కమ్యూనిటీ ఫీచర్ ఉంది. వాట్సప్ కూడా అలాంటి ఓ ఫీచర్ రూపొందిస్తోంది. గ్రూప్ పైన అడ్మిన్‌కు మరింత కంట్రోల్ తీసుకొచ్చేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Playback Controls for Audio Messages: ఇప్పటికే వాయిస్ నోట్స్ ప్లేబ్యాక్ స్పీడ్ ఫీచర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆడియో మెసేజెస్‌కు కూడా ఈ ఫీచర్ రానుంది. ఇతరుల నుంచి వచ్చే ఆడియో మెసేజెస్‌కు వాయిస్ నోట్స్‌కు కనిపించినట్టుగా 1.5X, 2X ప్లేబ్యాక్ స్పీడ్స్ కనిపిస్తాయి.

ఈ కొత్త ఫీచర్స్‌ అన్నీ ఆసక్తికరంగానే ఉన్నాయి. వీటితో పాటు డీపీ కూడా సెలెక్టడ్ కాంటాక్ట్స్ కే కనిపించే ఫీచర్ వస్తే ఇంకా బాగుంటుందికదూ..చాలామంది ఇలాంటి ఆప్షన్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు…మీ ఆత్మీయుల్లో ఎవరైనా ఇలాంటి ఫీచర్స్‌ కోసం ఎదురుచూస్తుంటే..వాళ్లకు సెండ్‌ చేసి వార్త షేర్‌ చేసేయండి మరీ!

– Triveni Buskarowthu