నోకియా 2.4 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర త‌క్కువ‌, మెరుగైన ఫీచ‌ర్లు..!

Join Our Community
follow manalokam on social media

హెచ్ఎండీ గ్లోబ‌ల్ సంస్థ నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. నోకియా 2.3 ఫోన్‌కు కొన‌సాగింపుగా ఈ ఫోన్‌ను విడుద‌ల చేశారు. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను అమ‌ర్చారు. మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్ ఉంది. 3జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఇందులో ఉంది. 2 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ను అందిస్తారు. ఇందులో వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల ఫోన్ కెమెరా యాప్‌లో పోర్ట్రెయిట్ మోడ్‌, నైట్ మోడ్ ఆప్ష‌న్లు ల‌భిస్తాయి.

Nokia 2.4 smart phone launched in india

ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఫోన్ వెనుక వైపు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్‌పై డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బ‌ట‌న్‌ను ఏర్పాటు చేశారు. డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రోఎస్‌డీ కార్డుల కోసం డెడికేటెడ్ స్లాట్ల‌ను అమ‌ర్చారు. 3డి నానో టెక్ట్చ‌ర్డ్ క‌వ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఉంది.

నోకియా 2.4 స్పెసిఫికేష‌న్స్‌…

* 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720 x 1600 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్
* 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్ (నానో + నానో + మైక్రోఎస్‌డీ)
* ఆండ్రాయిడ్ 10, అప్‌గ్రేడ‌బుల్ టు ఆండ్రాయిడ్ 11, 12
* 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ

నోకియా 2.4 స్మార్ట్ ఫోన్ డ‌స్క్‌, చార్‌కోల్‌, జార్డ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.10,399 గా ఉంది. నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లోనే ఈ ఫోన్ ప్ర‌త్యేకంగా ల‌భిస్తోంది. డిసెంబ‌ర్ 4 నుంచి ఈ ఫోన్‌ను ఇత‌ర ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ స్టోర్స్‌లోనూ విక్ర‌యించ‌నున్నారు.

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...