సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తాను విడుదల చేసిన పలు ఐఫోన్లలో ఫేస్ ఐడీ ఫీచర్‌ను అందిస్తున్న విషయం విదితమే. ఈ ఫీచర్ వల్ల ఆయా ఐఫోన్లను లాక్, అన్‌లాక్ చేసుకునేందుకు, మొబైల్ ద్వారా పేమెంట్లు చేసేందుకు వీలు కలుగుతుంది.
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తాను విడుదల చేసిన పలు ఐఫోన్లలో ఫేస్ ఐడీ ఫీచర్‌ను అందిస్తున్న విషయం విదితమే. ఈ ఫీచర్ వల్ల ఆయా ఐఫోన్లను లాక్, అన్‌లాక్ చేసుకునేందుకు, మొబైల్ ద్వారా పేమెంట్లు చేసేందుకు వీలు కలుగుతుంది. అయితే ఫేస్ ఐడీ ఫీచర్ యూజర్‌కు చెందిన ముఖాన్ని 3డీ స్కాన్ చేసుకుని ఫోన్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఇది ఒక్కసారే జరుగుతుంది. ఆ తరువాత ప్రతి సారీ కేవలం యూజర్ ముఖాన్ని ఐఫోన్ ముందు ఉంచితే చాలు, ఫోన్ దానంతట అదే అన్‌లాక్ అవుతుంది.
అయితే ఆయా ఐఫోన్లలో ఉన్న ఫేస్ ఐడీ ఫీచర్‌ను హ్యాక్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే యూజర్ కళ్లు తెరిచి ఉన్నప్పుడు కేవలం ముఖాన్ని స్కాన్ చేస్తేనే ఐఫోన్ అన్‌లాక్ అవుతుంది. యూజర్ ఫొటోను, మాస్క్‌ను వాడితే ఐఫోన్ అన్‌లాక్ అవ్వదు. అంతటి పటిష్టంగా ఫేస్ ఐడీ ఫీచర్‌ను యాపిల్ తీర్చిదిద్దింది. అయితే ఈ ఫీచర్‌ను ఓ రీసెర్చి టీం హ్యాక్ చేసింది. కేవలం సాధారణ అద్దాలు, బ్లాక్, వైట్ టేపులను వాడి యాపిల్ ఫేస్ ఐడీని బోల్తా కొట్టించారు. ఇంతకీ వారు చేసిన ట్రిక్ ఏమిటంటే…
యాపిల్ ఐఫోన్లలో ఉన్న ఫేస్ ఐడీ ఫీచర్‌ను హ్యాక్ చేసేందుకు కొందరు పరిశోధకులు ఓ సాధారణ కళ్లద్దాలను తీసుకుని దాని గ్లాసెస్ రెండింటిపై ముందుగా దీర్ఘ చతురస్రాకారంలో నల్లని టేప్‌ను అంటించారు. తిరిగి అదే టేప్‌పై చాలా చిన్న సైజ్‌లో చతురస్రాకారంలో ఉండే మరో వైట్ టేప్‌ను అంటించారు. ఆ తరువాత ఆ అద్దాలను నిద్రపోతున్న ఓ వ్యక్తి కళ్లకు తగిలించారు. అనంతరం అతని ఐఫోన్‌ను అతని ఎదురుగా పెట్టగానే.. ఆశ్చర్యంగా ఐఫోన్ అన్‌లాక్ అయింది. అలా ఆ పరిశోధకులు యాపిల్ ఫేస్ ఐడీ ఫీచర్‌ను హ్యాక్ చేశారు.
అయితే వారు చేసిన ఈ ట్రిక్ ఎలా సాధ్యమైందంటే.. యూజర్ కళ్లకు అద్దాలను పెట్టుకుంటే అతని ముఖంలో నిద్రపోతున్నాడా, మెళకువతో ఉన్నాడా అన్న వివరాలను ఫేస్ ఐడీ గుర్తించలేదు. అలాగే అద్దాలను పెట్టుకుంటే యూజర్ కళ్లను కూడా స్కాన్ చేయలేదు. దీంతో ఫేస్ ఐడీని బోల్తా కొట్టించవచ్చు. ఈ క్రమంలో పైన చెప్పినట్లుగా ఆ అద్దాలను తయారు చేసి యూజర్ నిద్రపోతున్నప్పుడు, స్పృహలో లేనప్పుడు, కళ్లు మూసుకున్నప్పుడు పెడితే అప్పుడు అతని కళ్లను ఫేస్ ఐడీ స్కాన్ చేయలేదు. దీనికి తోడు టేప్ అడ్డుగా ఉంటుంది కనుక ఫేస్ ఐడీ ఆ వివరాలను బైపాస్ చేసి కేవలం యూజర్ ముఖాన్ని మాత్రమే స్కాన్ చేస్తుంది. అది ఎలాగూ స్టోర్ చేసుకున్న యూజర్ ముఖం వివరాలతో సరిపోలుతుంది కనుక ఫేస్ ఐడీ యూజర్ ఐఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. అలా ఆ పరిశోధకులు యాపిల్ ఫేస్ ఐడీని బోల్తా కొట్టించారు. అయితే గతంలోనూ ఓ 3డీ ప్రింటెడ్ మాస్క్‌తో ఇలాగే యాపిల్ ఫేస్ ఐడీని కొందరు హ్యాక్ చేయగా.. ఇప్పుడు ఇది మరొక ట్రిక్‌గా తెరపైకి వచ్చింది. మరి ఈ విషయాలను యాపిల్ పరిగణనలోకి తీసుకుని మరింత పటిష్టంగా ఫేస్ ఐడీని డెవలప్ చేస్తుందా, లేదా.. చూడాలి..!