శాంసంగ్ గెలాక్సీ ఎ21ఎస్‌.. అదిరిపోయిన ఫీచ‌ర్లు.. ధ‌ర ఎంతంటే..?

-

శాంసంగ్ కంపెనీ.. గెలాక్సీ ఎ21ఎస్ పేరిట భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. ఎ సిరీస్‌లో వ‌చ్చిన శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-ఓ-డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెస‌ర్‌, 6జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారంగా ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని అమ‌ర్చారు.

Samsung Galaxy A21s smart phone launched in India

శాంసంగ్ గెలాక్సీ ఎ21ఎస్ స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720×1600 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10
* 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 13 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ రిక‌గ్నిష‌న్
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎ21ఎస్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌, వైట్‌, బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,499 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.18,499గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news