టెక్నాలజీ కాలంలో ఏ చిన్న సమాచారం కావాలన్నా ఇంట్లో కుర్చోనే బ్రౌజ్ చేస్తే చాలు..క్షణాల్లో సమాచారం మన ముందు ఉంటుంది. ఒకప్పుడు బ్యాంక్‌లో డబ్బులు వేయాలన్నా తీయాలన్నా.. బ్యాంకుకు పొద్దున్నే వెళ్లి కాయిన్ తీసుకుని మన నెంబర్ వచ్చే వరకూ ఎదురుచూడాలి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. కనురెప్పపాటు కాలంలోనే.. అకౌంట్లో మనీ వేస్తున్నాం తీస్తున్నాం. టెక్నాలజీ మనకు ఇంత వెసులుబాటు ఇచ్చిందో.. అంతే సవాల్‌ను కూడా మనముందు ఉంచింది.
టైంపాస్‌కు వాడే ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ మొదలు.. రకరకాల యాప్స్‌లో లాగిన్ అవ్వాలంటే యూజర్‌నేమ్, పాస్వార్డ్ తప్పనిసరి..ఇలా ఒక్కోదానికి ఒక్కో పాస్వార్డ్ పెడితే..మన బుర్రకు గుర్తు ఉండదు. అన్నింటికి కలిపి చాలామంది ఒకటే పాస్వార్డ్ పెట్టేస్తుంటారు. పెట్టినవాళ్లు ఏమైనా ఊరికే ఉంటారా..బ్రౌజర్లో లాగిన్ అయ్యేప్పుడు సేవ్ పాస్వార్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. ఆ ప్రతిసారీ ఎవడు ఇవన్నీ చేస్తాడు..సేవ్ చేస్తే డైరెక్టుగా ఓపెన్ చేసేయొచ్చు..లాప్టాప్ మనదే ప్రాబ్లమ్ ఏంటి అనుకుంటారు. ఇలా చేయటం ఎంతవరకు మంచిపద్దతో ఇప్పుడు చూద్దాం.
టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం యూజర్లు వీలైనంత వరకు లాగిన్ వివరాలను గుర్తుంచుకోవడమే మంచిదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. బ్రౌజర్లో సేవ్ చేసుకోకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. బ్రౌజర్స్‌లో పూర్తి స్థాయి భద్రత ఉండదనేది నిపుణుల అభిప్రాయం. ఒకవేళ బ్రౌజర్లలో ఏవైనా యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకుంటే వెంటనే డిలీట్ చేయండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రౌజర్స్‌లో లాగిన్ వివరాలను సేవ్ చేస్తే.. సైబర్ దాడులు జరిగితే అప్పటికే సేవ్ అయిన లాగిన్ వివరాలను సులభంగా తస్కరించవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే సేవ్ చేసి ఉన్న పాస్వార్డలను తొలగించటం కొంచె ప్రాసెస్‌తో కూడుకున్న పని..దానికి బదులుగా మీరు కొత్తపాస్వార్డ్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా బ్రౌజర్లో పాస్వార్డ్ సేవ్ చేసుకోవటం వంటివి చేయొద్దు. మీరు కానీ మీ ఆత్మీయుల్లో ఎవరైనా ఇలా చేసి ఉంటే వెంటనే విషయం చెప్పి హెచ్చరించండి. ఇప్పటికే సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు మునపటికంటే మేరుగ్గా కొత్త కొత్త మార్గాలను ఎంచుకున్నారు. చాలా తెలివిగా ఉంటే తప్ప మనం వీటినుంచి తప్పించుకోలేం.
క్రెడిట్ కార్డులు వాడే వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫీడ్‌బ్యాక్ కోసం అని కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అంటూ అడుగుతారు. మనం పొరపాటున వాళ్లు నిజంగానే బ్యాంక్ వారే అని నమ్మి..ఏదో ఒకటి చెప్పినా, కార్డ్ లిమిట్ పెంచమని అడిగినా..వాళ్లు చేస్తాం అంటూ మనల్ని బుట్టలో పడేస్తారు. ఆపై..కోడ్ వచ్చింది అది మాకు చెప్తే..కార్ట్ లిమిట్ పెరుగుతుంది అని చెప్తారు. మనం ఓటిపీ కాదు కదా అనుకుని చెప్పామంటే..మీ క్రెడిట్ కార్డులో డబ్బులు పోవటం కాయం. ఈ మధ్య ఇలాంటి నేరాలు ఎక్కువైపోతున్నాయి. వాళ్లు మన పేరు, పాన్‌కార్డు నెంబర్ చెప్పేసరికి మనకు చేసింది బ్యాంక్ వాళ్లే అని నమ్మకం కలుగుతుంది. కానీ దాదాపు సైబర్ నేరగాళ్లే అయి ఉంటారు. తెలియని వ్యక్తులకు మీ డీటేల్స్ ఇచ్చేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-Triveni Buskarowthu