ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. ఫోన్ల‌పై 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న ఖాతాదారుల‌కు అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను అందిస్తోంది. ఆ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్లు త‌క్కువ ధ‌ర‌ల‌కే అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఐఫోన్ల‌తోపాటు శాంసంగ్‌, రెడ్‌మీ, వ‌న్‌ప్ల‌స్‌, ఒప్పో, వివో, ఎల్‌జీ, నోకియా త‌దిత‌ర కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌పై ఎస్‌బీఐ కార్డుల ద్వారా 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

sbi customers can get up to 40 percent discount

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఆయా ఫోన్ల‌ను కొంటే క‌నీసం 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇక ఫోన్ మోడ‌ల్‌ను బ‌ట్టి డిస్కౌంట్ 40 శాతం వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో కొంటే అద‌నంగా మ‌రో 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అయితే రూ.5వేల క‌నీస ట్రాన్సాక్ష‌న్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒక కార్డుకు గ‌రిష్టంగా రూ.1000 డిస్కౌంట్ ఇస్తారు.

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు మ‌రిన్ని ఆఫ‌ర్ల వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే యోనో ఎస్‌బీఐ లోకి లాగిన్ అయ్యి అందులో ఉండే బెస్ట్ ఆఫ‌ర్స్ అనే విభాగంలోకి వెళ్లాలి. అక్క‌డ ఆఫర్ల వివ‌రాలు తెలుస్తాయి.

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు గెలాక్సీ ఎం12, రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ 9, వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 5జి, గెలాక్సీ ఎం31ఎస్, రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ 9 ప‌వ‌ర్‌, గెలాక్సీ ఎం51, వ‌న్‌ప్ల‌స్ 8టి 5జి, ఐఫోన్ 12 మినీ, శాంసంగ్ గెలాక్సీ ఎం02, వ‌న్‌ప్ల‌స్ 8 ప్రొ 5జి, గెలాక్సీ ఎం21, గెలాక్సీ ఎం02ఎస్‌, రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్, గెలాక్సీ నోట్ 10 లైట్‌, ఒప్పో ఎ31, రెడ్‌మీ నోట్ 9 ప్రొ, రెడ్‌మీ 9ఎ, వివో వై91ఐ, వై11, ఎల్‌జీ డ‌బ్ల్యూ41, ఒప్పో ఎ15ఎస్‌, గెలాక్సీ 12, ఒప్పో ఎ15, గెలాక్సీ ఎం11, ఒప్పో ఎ11, నోకియా 3.4, వివో వై12ఎస్‌, వై20 ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు పొంద‌వ‌చ్చు. వీటితో పాటు అనేక ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.