సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీ లు లాంచ్.. ధర ఎంతంటే?

-

ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ సోని ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని చాటుతుంది..టెక్నాలజీ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లు కలిగిన వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది. తాజాగా మరో కొన్ని స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

సోనీ బ్రావియా ఎక్స్ఆర్ ఎక్స్90కే (Sony Bravia XR X90K) సిరీస్‌లో మూడు డిస్‌ప్లే సైజ్‌ల్లో మోడల్స్ లాంచ్ అయ్యాయి. 75 ఇంచులు (XR-75X90K), 65 ఇంచులు (XR-65X90K) , 55 ఇంచుల (XR-55X90K) స్క్రీన్ సైజ్‌ల స్మార్ట్ టీవీలు మార్కెట్‌లోకి వచ్చాయి. కాగ్నిటివ్ ప్రాసెసర్‌ ఎక్స్‌ఆర్‌ టెక్నాలజీ కలిగి ఉన్న ఈ టీవీలు 4K రెజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేలతో వస్తున్నాయి. అత్యుత్తమైన కాంట్రాస్ట్, కలర్స్ ఇచ్చేందుకు ఈ టీవీల్లో ఎక్స్ఆర్ ట్రిలుమినోస్ ప్రో టెక్నాలజీ కూడా ఉంటుంది. 40వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు Sony Bravia XR X90K స్మార్ట్ టీవీల్లో ఉండగా.. డాల్బీ అట్మోస్, అకోస్టిక్ మల్టీ ఆడియో, 3జీ సరౌండ్ అప్‌స్కేలింగ్ టెక్నాలజీస్ సపోర్ట్ ఉంటుంది.

సోనీ బ్రావియా ప్రీమియమ్ టీవీల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర..

క్లియర్, బ్రైట్ విజువల్స్ కోసం కాగ్నిటివ్ ప్రాసెసర్‌ ఎక్స్ఆర్, ఎక్స్ఆర్ 4కే అప్‌స్కేలింగ్, ఎక్స్ఆర్ మోషన్ క్లారిటీ టెక్నాలజీలను ఈ టీవీల్లో సోనీ పొందుపరిచింది. గేమింగ్ కోసం విభిన్నమైన రిఫ్రెష్ రేట్స్, ఆటో లో లాటెన్సీ మోడ్ కూడా ఈ టీవీల్లో ఉంటుంది. వెలుతురును బట్టి బ్రైట్‌నెస్ మారేలా ఆటోమేటిక్ లైట్ సెన్సార్ కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి.గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్, గేమ్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాదాపు అన్ని పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఐఫోన్స్, ఐప్యాడ్స్ లాంటి యాపిల్ డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునేందుకు యాపిల్ హోమ్ కిట్, ఎయిర్‌ప్లేకు కూడా ఈ ప్రీమియమ్ టీవీలు సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలకు 4 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులను కలిగి ఉంటుంది.

ధర..

55 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.1,23,490గా ఉంది. సోనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ shopatsc.comలో సేల్‌ మొదలైంది. అయితే 75 ఇంచులు, 65 ఇంచుల డిస్‌ప్లే మోడల్స్ ధరను సోనీ ఇంకా ప్రకటించలేదు. అతిత్వరలోనే ఈ టీవీలు కూడా సేల్‌కు వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సోనీ సెంటర్లు, ప్రముఖ రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లోనూ ఈ టీవీ లు అందుబాటులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news