ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో భారీగా పెరిగిన డయాబెటిస్ కేసులు!!

-

భారత్‌లో మధుమేహం కేసులు ఆందోళన రేకేత్తిస్తున్నాయి. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజాగా మార్గదర్శకాలకు విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం.. గతంలో మధుమేహ బాధితులకు కరోనా ప్రభావం అధికంగా చూపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలను తీసుకొచ్చింది. కాగా, ప్రపంచంలోనే మధుమేహ వ్యాధుల్లో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. మూడు దశాబ్దాలుగా దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు 150 శాతం పెరుగుతున్నారని ఐసీఎంఆర్ వెల్లడించింది.

డయాబెటిస్
డయాబెటిస్

డయాబెటిస్ టైప్-1 నియంత్రణలో జీవనశైలి నిర్వహణ కీలకమని ఐసీఎంఆర్ పేర్కొంది. మధుమేహ వ్యాధి నియంత్రణలో ఆహార నియమాలు, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. బీపీ, బరువు, కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో కార్బోహైడ్రెట్స్ 70 శాతం ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. ప్రతి రోజు వ్యాయామం, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, స్థూలకాయం, హృద్రోగ ముప్పు తగ్గిస్తుందని ఐసీఎంఆర్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news