ఇక ఫోన్లలోనూ టాటా స్కై బింజ్ యాప్ విడుదల చేసిన ఓటీటీ ప్లాట్‌ఫాం. టాటా స్కై బింజ్ పేరుతో ఓటీటీ సర్వీస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సర్వీస్ మొబైల్ డివైజ్‌లకు అందుబాటులోకి వచ్చింది.ఇంతకాలం టీవీలకే అందించిన టాటా స్కై బింజ్ ఇక మొబైల్ ఫోన్లలోనూ వాడుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది.
తాజాగా ఆండ్రాయిడ్, ఐ ఫోన్లకు యాప్‌లను విడుదల చేసింది. బింజ్‌లో పెయిడ్ సర్వీసెస్‌కు సబ్‌స్రైబ్ చేసుకుంటే డిస్నీ+ హాట్‌స్టార్, ఎరోస్ నౌ, వూట్ సెలక్షన్, సోనీ లివ్‌తో పాటు మొత్త్తం 10 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను వాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు టాటా బింజ్ నెలకు రూ.149లకే ప్లాన్ తీసుకొచ్చింది. ఒకవేళ టీవీల్లోనూ ఈ టాటా స్కై బింజ్‌ను వాడాలంటే నెలకు రూ.299 ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ను టాటా స్కై సబ్‌స్రైబర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
మొబైల్ నంబర్ లేదా టాటా స్కై సబ్‌స్రైబర్ ఐడీ ద్వారా లాగిన్ అయి బింజ్ సర్వీస్‌లను వాడుకోవచ్చు. టాటా స్కై బింజ్‌లో లాగిన్ అయ్యాక మొబైల్ డివైజెస్‌లో వినియోగదారులు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవచ్చు. వివిధ స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి షోలు, వెబ్ సిరీస్‌లు, పాపులర్ సినిమాలు, ట్రెండింగ్ వీడియోలు చూడవచ్చు. అలాగే భాషను కూడా సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే వివిధ ఓటీటీల్లోనూ కంటెంట్‌ను ఒకే దగ్గర సెర్చ్ చేసే ఫీచర్ కూడా టాటా స్కై బింజ్‌లో ఉంది.
2019లో అమెజాన్ భాగస్వామ్యంతో టాటా స్కై బింజ్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. అమెజాన్ ఫైర్ స్టిక్ ద్వారా టాటా స్కై సబ్‌స్రైబర్లు మాత్రమే ఈ సర్వీస్‌ను పొందే అవకాశం ఉండేది. ఆ తర్వాత టాటా స్కై సొంతంగా ‘టాటా స్కై బింజ్ ప్లస్’ పేరుతో ఆండ్రాయిడ్ సెటాప్ బాక్సులను అందుబాటులోకి లె చ్చింది.
ఒకే సబ్‌స్క్రిప్షన్ ద్వారా అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వాడుకునే సదుపాయం ఉండడంతో ఇది హిట్టవుతుందని టాటా స్కై నమ్మకంతో ఉంది. అయితే ప్రస్తుతం బింజ్‌లో అమెజాన్ ప్రైమ్ ఆప్షన్ ఉన్నా.. వేరుగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటేనే ఆ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది.