ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆగిపోయిన రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ నుంచి గుహవటి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరోనాతో వాయిదాపడ్డ రైళ్లు.. తెలంగాణలో లాక్ డౌన్ సమయం తగ్గించడం.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సడలింపుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువ అయింది.
దీనికి రైల్వేశాఖ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్–గువాహటి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్ – గువాహటి (07030/07029) స్పెషల్ ట్రైన్ ఈ నెల 6, 13 తేదీల్లో ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి రెండో రోజు ఉదయం 6.15 గంటలకు గువాహటి చేరుకుంటుంది.
గువహటి నుంచి తిరుగు ప్రయాణంలో ఈ నెల 9, 16 తేదీల్లో ఉదయం 6.45 గంటలకు గువాహటి నుంచి బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరు కుంటుందని వెల్లడించారు. కరోనా దృష్ట్యా వ్యాధి వ్యాప్తి కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఆర్వో తెలిపారు. అయితే, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసుల సందర్భంగా త్వరలోనే రద్దయిన ఇతర రైళ్లను కూడా పునరుద్దరిస్తామని తెలిపారు.