టెలివిజన్ తయారీదారు టీసీఎల్ భారత్‌లో నూతన క్యూలెడ్ టీవీలను లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.45,990గా ఉంది. సి715, సి815, ఎక్స్915 సిరీస్‌లలో సదరు టీవీలు విడుదలయ్యాయి. ఇక ఇవి 50 నుంచి 85 ఇంచుల డిస్ప్లే సైజుల్లో వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇక ఈ సిరీస్‌లో టీసీఎల్85ఎక్స్915 మోడల్ 75 ఇంచుల 8కె క్యూలెడ్ టీవీ ధర రూ.2,99,990గా ఉంది. వీటన్నింటిలోనూ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను అందిస్తున్నారు. అలాగే హెచ్డీఆర్ సపోర్ట్, హ్యాండ్స్ ఫ్రీ ఫార్ ఫీల్డ్ వాయిస్ రికగ్నిషన్ తదితర ఇతర అధునాతన ఫీచర్లను కూడా అందిస్తున్నారు.
ఈ టీవీ సిరీస్‌లలో అందుబాటులో ఉన్న అనేక టీవీ మోడల్స్‌లో ఫీచర్లన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. కాగా ఎక్స్915 మోడల్లో 8కె రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. ఇక సి715 వేరియెంట్ ధర రూ.45,990 ఉండగా, 50 ఇంచ్ వేరియెంట్ ధర రూ.55,990గా ఉంది. 55 ఇంచుల వేరియెంట్ రూ.79,990 ధరకు లభిస్తోంది. అలాగే సి815 సిరీస్‌లో 55 ఇంచుల టీవీ ధర రూ.69,990గా, 65 ఇంచుల వేరియెంట్ ధర రూ.99,990గా ఉంది. అలాగే 75 ఇంచుల వేరియెంట్ ధర రూ.1,49,990గా ఉంది.
ఇక ఇటీవలే విడుదల చేసిన టీసీఎల్ పి715 సిరీస్ టీవీల ధరలను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ సీరస్‌లో 43 ఇంచుల వేరియెంట్ ధర రూ.28,990 ఉండగా, 50 ఇంచుల టీవీ ధర రూ.34,990గా ఉంది. అలాగే 55 ఇంచుల టీవీ ధర రూ.39,990 ఉండగా, 65 ఇంచుల టీవీ ధర రూ.61,990గా ఉంది. ఇక 75 ఇంచుల టీవీ ధరను రూ.99,990గా నిర్ణయించారు.
సి715, సి815 టీవీలలో 4కె క్యూలెడ్ డిస్ప్లేను, ఎక్స్915 టీవీలలో 8కె క్యూలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఆండ్రాయిడ్ టీవీ 9.0 పై ఓఎస్, హెచ్డీఆర్కు సపోర్ట్, డాల్బీ విజన్, స్టాండర్డ్ అండ్ ఫార్ ఫీల్డ్ వాయిస్ రికగ్నిషన్ ఫర్ గూగుల్ అసిస్టెంట్, డాల్బీ అట్మోస్, డీటీఎస్-హెచ్డీ ఆడియో, స్మార్ట్ డివైసెస్‌కు సపోర్ట్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఎక్స్915, సి815 మోడల్స్‌తో ఓంక్యో కంపెనీకి చెందిన సౌండ్ బార్స్‌ను అందిస్తారు. ఎక్స్915 టీవీల్లో పాపప్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో వీడియో చాట్, కాన్ఫరెన్స్ సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.