సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్ పే డిజిటల్ పేమెంట్స్ యాప్ కు గతంలో ఎంత ఆదరణ ఉండేదో అందరికీ తెలిసిందే. కానీ గత 3 నెలల కాలంలో ఈ యాప్‌కు ఆదరణ తగ్గింది. ఈ వ్యవధిలో ఆ యాప్‌లో తగ్గిన ట్రాన్సాక్షన్లే ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. అదే సమయంలో ప్రత్యర్థులైన పేటీఎం, ఫోన్‌పేలలో భారీగా ట్రాన్సాక్షన్లు పెరిగాయి.
గూగుల్ పేలో నవంబర్ లో 960 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరగ్గా జనవరి వరకు వచ్చే సరికి ఆ లావాదేవీల సంఖ్య భారీగా తగ్గింది. 3 నెలల్లో ఏకంగా 100 మిలియన్ల ట్రాన్సాక్షన్లు తగ్గి ఆ సంఖ్య జనవరి చివరి వరకు 855 వరకు చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే గూగుల్‌పే ఆదరణ తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే గూగుల్ పేకు బదులుగా పేటీఎం, ఫోన్‌పేలను యూజర్లు ఈ కాలంలో ఎక్కువగా ఉపయోగించారు. దీంతో గూగుల్ పేలో జరగాల్సిన సదరు 100 మిలియన్ల ట్రాన్సాక్షన్లు ఆ రెండు యాప్‌లలో జరిగాయి. దీంతో ఆ యాప్‌లు ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేయగలిగాయి. అయితే గూగుల్ పే దేశంలోని ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీతోపాటు యాక్సిస్, ఐసీఐసీఐ వంటి బ్యాంకులతో యూపీఐ చెల్లింపులకు ఒప్పందాలు చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఎస్‌బీఐతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో చాలా సాంకేతిక్ సమస్యలు వస్తాయి. అందువల్లే ట్రాన్సాక్షన్లు ఫెయిలవుతుండడంతో గూగుల్ పేకు బదులుగా యూజర్లు ఆ రెండు యాప్‌లను వాడడం మొదలు పెట్టారు. మరి ఈ విషయంపై గూగుల్ దృష్టి సారిస్తుందో, లేదో చూడాలి.