బీజేపీ అనే మర్రిచెట్టు నాల్గవ కొమ్మ షర్మిల పార్టీ !

Join Our Community
follow manalokam on social media

 షర్మిల పొలిటికల్ ఎంట్రీ గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెట్టాలని అనుకుంటున్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలసి పనిచేయవచ్చు కదా ? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అనే మర్రిచెట్టు నాల్గవ కొమ్మ షర్మిల పార్టీ అని ఆయన విమర్శించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టి తప్పు చేస్తున్నారన్న ఆయన కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఈ ప్రయత్నాల చేస్తున్నారని అన్నారు.

jagga-reddy
jagga-reddy

విభజన తర్వాత ఈ పార్టీల లొల్లి ఎందుకు… ? ఉమ్మడి రాష్ట్రం చేసేయండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి స్క్రిప్ట్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నారని, కేసీఆర్ వైఎస్ షర్మిల పార్టీపై ఎందుకు మాట్లాడడం లేదు ? ఆయన నోరు ఏమైనది ? అని అయన ప్రశ్నించారు. హైదరాబాద్ ఏమైనా పొలిటికల్ టూరిస్ట్ స్పాటా ? అని ప్రశ్నించిన అయన కేసీఆర్, వైఎస్ జగన్,పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిలలు అమిత్ షా బాణాలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...