ఇకపై సిస్టమ్ లో కూడా వాట్సాప్ వీడియో కాలింగ్… యూజర్లకు పండుగే…

-

ప్రస్తుత రోజుల్లో మన దేశంలో విపరీతంగా వాడే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. ఎంతలా అంటే తెల్లారి లేస్తే జనాలు వాట్సాప్ చూడకుండా బెడ్ దిగడం లేదు. ఈ పరిస్థితిని చూస్తేనే అర్థమవుతుంది యువతలో వాట్సాప్ కు ఎంతలా క్రేజ్ ఉందో. కరోనా పరిస్థితుల వలన చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. ఈ వర్క్ ఫ్రం హోం విధానం వల్ల చాలా మందికి ఆఫీసు కాల్స్ మాట్లాడడం పరిపాటిగా మారింది.

వాట్సాప్ వీడియో కాలింగ్ | Whatsapp video calling

దీంతో వీడియో కాల్స్ చేసే యాప్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దానితో వాట్సాప్ కూడా డెస్క్ టాప్ లో వీడియో కాలింగ్ ఫీచర్ తీసుకువచ్చేందుకు బాగా ప్రయత్నించింది. ఎట్టకేలకు వాట్సాప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించి డెస్క్ టాప్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.

కానీ వాట్సాప్ ఇందులో చిన్న మెలిక పెట్టింది. ప్రస్తుతం తీసుకువచ్చిన డెస్క్ టాప్ వీడియో కాలింగ్ ఫీచర్ కేవలం కొన్ని రకాల ఆపరేటింగ్ సిస్టాలకు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుందని తెలిపింది. అతి త్వరలో అన్ని రకాల సిస్టమ్స్ కు సపోర్ట్ చేసే ఫీచర్ ను తీసుకువస్తామని వెల్లడించింది. విండోస్ 10 64-బిట్ వెర్షన్, మ్యాక్ ఓఎస్ 10.13 వెర్షన్లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుందని ప్రకటించారు. చాలా మంది యూజర్లు వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ మొబైల్ లో ఉండి… డెస్క్ టాప్ లో లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం వీడియో కాలింగ్ ఫీచర్ వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ లో కూడా అందుబాటులోకి రావడంతో యూజర్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version