షియోమీ అద్భుతం.. 108 మెగాపిక్సల్ కెమెరాతో వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్..!

-

మొబైల్ తయారీ కంపెనీలు భారీ కెపాసిటీ ఉన్న కెమెరాలు కలిగిన ఫోన్లనే ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్‌లో మనకు 64 మెగాపిక్సల్ కెమెరా ఉన్న ఫోన్లే వచ్చాయి. కానీ షియోమీ ఏకంగా 108 మెగాపిక్సల్ కెమెరా ఉన్న ఫోన్‌ను విడుదల చేయనుంది.

ఒకప్పుడు ఫోన్లను కేవలం కాల్స్, మెసేజెస్ కోసమే వాడేవారు. కానీ కాలం మారింది. ఇప్పటి స్మార్ట్‌ఫోన్లలో మనం అనేక పనులు చేసుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఏ ఫోన్ అయినా.. దాంట్లో కెమెరా కెపాసిటీ ఎంత ఉంది ? అనే చాలా మంది వినియోగదారులు చూస్తున్నారు. ఎందుకంటే చక్కని ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది మంచి కెమెరా కెపాసిటీ ఉన్న ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. ఇక మొబైల్ తయారీ కంపెనీలు కూడా భారీ కెపాసిటీ ఉన్న కెమెరాలు కలిగిన ఫోన్లనే ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మార్కెట్‌లో మనకు 64 మెగాపిక్సల్ కెమెరా ఉన్న ఫోన్లే వచ్చాయి. కానీ షియోమీ ఏకంగా 108 మెగాపిక్సల్ కెమెరా ఉన్న ఫోన్‌ను విడుదల చేయనుంది.

Xiaomi launching 108 MP camera phone soon

మొబైల్స్ తయారీదారు షియోమీ మంగళవారం (నవంబర్ 5) ఎంఐ సీసీ9 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇందులో 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాక్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరో 4 కెమెరాలు.. మొత్తం కలిపి వెనుక భాగంలో 5 కెమెరాలుంటాయి. ఇక ఈ ఫోన్‌లో 6.47 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 5260 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫోన్ ముందుగా చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాక ఆ తరువాత భారత్‌లో లభ్యం కానుంది. దీని ధర వివరాలను షియోమీ ఇంకా వెల్లడించలేదు. కాగా భార‌త్‌లో ఈ ఫోన్‌ను షియోమీ.. ఎంఐ నోట్ 10 పేరిట విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news