ఇక వాట్సప్‌లో వాటిని స్క్రీన్‌ షాట్‌ కొట్టలేరు.. లెఫ్ట్‌ అయినా అందరికీ తెలియదట..!

-

వాట్సప్‌లో ఒకదాన్ని మించి ఇంకో ఫీచర్ లు వస్తున్నాయి. ఇంతకు ముందు ఫోటోలు పంపింతే డిలీట్‌ చేయడం మన చేతుల్లో ఉండదు. కానీ ఇప్పుడు ఫోటోలు పంపితే డిలీట్‌ చేయొచ్చు. ఆ తర్వాత డిలీట్‌ కూడా చేయకుండా ఏకంగా ఒక్కసారి ఫోటో చూస్తే ఆటోమెటిక్‌గా ఫోట్‌ డిస్‌అప్పియర్‌ అయిపోయే ఆప్షన్ వచ్చింది. అయితే అవతలి వ్యక్తి.. వోన్లీ వన్స్‌ ఆప్షన్‌తో ఫోటో పంపుతున్నారు అని తెలిసి చాలామంది.. ఆ ఫోటోను స్క్రీన్‌ షాట్‌ తీసుకుంటున్నారు. ఇంక దీని వల్ల ఆ ఆప్షన్‌ ఉండి ఏం ఉపయోగం..మీకు ఇలానే అనిపించిందా.. అయితే త్వరలో అలా జరగదుగా..!
 ‘వ్యూ వన్స్ మెసేజెస్’ను ఇకపై స్క్రీన్ షాట్ తీసే అవకాశం ఉండదు. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉందట.
ప్రస్తుతం ఒక గ్రూపులోంచి ఎవరైనా వెళ్లిపోతే దానికి సంబందించి ‘లెఫ్ట్’ అనే సమాచారం అందరికీ కనిపిస్తుంది. ఇకపై గ్రూపులోంచి ఎవరైనా ‘లెఫ్ట్’ అయితే, అడ్మిన్‌కు మాత్రమే తెలిసేలా కొత్త ఫీచర్ రాబోతుంది. దీనివల్ల మిగతా సభ్యులకు తెలియకుండానే గ్రూపులోంచి వెళ్లిపోవచ్చు.
అలాగే ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు అందరికీ కాకుండా, కావాల్సిన వారికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. అవసరం లేని వారికి యూజర్లు తాము ఆన్‌లైన్‌లో ఉన్నట్లు కనిపించకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇప్పటివరకూ లాస్ట్‌ సీన్‌ వరకే ఈ ఆప్షన్‌ ఉంది. నోబడీ, ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, మై కాంటాక్స్‌ ఎక్స్‌ప్ట్‌ ఇలా. ఇక పై నుంచి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు కూడా ఇలా సెట్‌ చేసుకోవచ్చు.
వాట్సప్‌లో ఈ మధ్య కాలంలోనే చాలా మార్పులు వచ్చాయి. అన్నింటికంటే హైలెట్‌ ఫీచర్‌ అంటే.. డీపీని కూడా కావాల్సిన వాళ్లకే కనిపించేలా చేసుకోవడం. ఇంతకు ముందు అయితే కాంటాక్ట్స్‌, లేదా నోబడి, ఎవ్రీవన్‌ ఆప్షన్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కాంటాక్ట్స్‌లో కూడా మనకు కావాల్సిన వాళ్లకే డీపీ కనిపించేలా సెట్‌ చేసుకోవడం వల్ల..అవతలి వ్యక్తి నంబర్‌ మనం సేవ్‌ చేసుకున్నా..ఇష్టంలేదంటే డీపీ కనిపించకుండా చేసుకోవచ్చు. ముందు ముందు ఇంకే ఫీచర్స్‌ వాట్సప్ తీసుకువస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version