పుణ్యకోటి ఆవు కథ.. నా చావే ఇంత ధారుణంగా ఉంటే.. నీ పరిస్థితి ఏంటా అని

అనగనగా ఒక ఊర్లో చిత్తయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఆవులను మేపుతూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. చిత్తయ్య దగ్గర పుణ్యకోటి అనే ఆవు ఉండేది. వర్షాలు కురవక వ్యవసాయం కష్టంగా మారడంతో చిత్తయ్య తన దగ్గరున్న గోవులను అమ్మాలనుకుంటాడు. అప్పుడు గోవులను కొని చంపి అమ్మే వ్యక్తి వచ్చి ఆ ఆవులను కొనాలనుకుంటాడు. ఇక ఆ ఆవుల మందను తీసుకెళ్ళిన అతను పుణ్యకోటిని చంపి అమ్మడానికి సిద్ధమవుతాడు.

వాడు ఒక పెద్ద కత్తి తీసుకుని గోవును చంపడానికొచ్చినపుడు…..ఆ గోవు వానిని చూసి నవ్వింది. దాన్ని చూసి ఎందుకు నవ్వుతున్నావ్‌.. చవంటే నీకు అంత ఇష్టమా.?? భయం లేదా అంటూ అడిగాడు. అప్పుడు పుణ్యకోటి ఇలా చెప్పింది.

నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు. అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది. ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నాకు ఇంత దుస్థితి వచ్చింది.. అలాంటిఇ నువ్వు నన్నుచంపి, నా మాంసాన్ని తినే నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను అంది.

పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి. కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని తిని మీకు స్వఛ్చమైన పాలను ఇచ్చాను. ఆ పాలతో వెన్న చేసుకున్నారు. వెన్నతో నెయ్యి చేసుకున్నారు. నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు. అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు. పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు. (ఆగ్నికి ఏ పదార్ధాన్ని ఆహుతిచ్చినా అది కార్బన్-డై-ఆక్సయిడ్ ని, ఇతర హానికార, కాలుష్యకారక పదార్ధాలను విడుదల చేస్తుంది. కానీ ఆవు నెయ్యిని అగ్నికి ఆహుతిస్తే, 10 గ్రాముల ఆయినెయ్యి 1 టన్ను ఆకిజెన్ (ప్రాణవాయువు) ను ఉత్పత్తి చేస్తుంది.)

అలాంటి మమ్మల్ని మీరు ఇంత ఘోరంగా చంపుతున్నారు.. నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్. ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే. నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్. కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్. నిన్ను నీ కన్న తల్లికంటే నేనే ఎక్కువ ఆసరాగా నిలిచాను. నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?

నా సంతతిని ,నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే మీకు ,మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో మాకే … భవిష్యత్తులో మా ఉనికి లేనప్పుడు ..మీ కెక్కడి మనుగడ,అందుకే నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.

గో హింస మహా పాపం. గోమాతను కాపడటం మన బాధ్యత..