గుప్పెడంత మనసు ఎపిసోడ్ 239: కారులో షికారుకెళ్లిన రిషీ వసుధార..! 

-

గుప్పెండత మనసు ( Guppedantha Manasu ) ఈరోజు ఎపిసోడ్ లో వసూ సోఫాలో కుర్చోని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోపక్క జగతి లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. బ్యాగ్ తీసుకుని వసూ జగతి దగ్గరకు వస్తుంది. జగతి కోపంగా ఏంటీ అంటుంది. వసూ ఏం లేదు మేడమ్ అంటుంది. జగతి చెప్పాను కదా నా పర్మిషన్ లేకుండా పంపించను అని అంటుంది. వసూకి రిషీ మేసేజ్ చేస్తాడు. బయట వెయిట్ చేస్తున్నా రా అని..ఇంతలోనే జగతికి రిషీ మెయిల్ పంపిస్తాడు. ఆ మెయిల్ చూసిన జగతి రెండు బాక్సులు ఇచ్చి వెళ్లు అంటుంది. ఆనందంగా బయటకు వెళ్తుంది వసు.
Guppedantha Manasu | గుప్పెడంత మనసు
Guppedantha Manasu | గుప్పెడంత మనసు
రిషీ కారు దగ్గరు వేయిట్ చేస్తూ.. నేనేంటి వసుధార కోసం వెయిట్ చేయటం ఏంటి, నాకెందుకు ఇంత శ్రద్ధ అనుకుని అయినా శ్రద్ధ చూపిస్తే తప్పేంలేదుగా..తను నా స్టూడెంట్ కదా అనుకుంటూ ఉంటాడు.. ఇంతలో అటుగా వెళ్తున్న శిరీష్ ను రిషీ చూస్తాడు. శిరీష్ కూడా చూస్తాడు. కారు ఆపి ఏంటి సార్ కారు ట్రబుల్ ఇచ్చిందా అని అడుగుతాడు.. లేదు ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా అంటాడు రిషీ. ఎక్కడికి వెళ్తున్నారు అని రిషీ అడిగితే..ఇంక ఎక్కడికి.. పక్కనేగా మా వసూ ఉండేది..ఈరోజు హాలిడే కదా సరదాగా అక్కడే గడిపేద్దాం అని శిరీష్ అంటాడు.రిషీ మనసులో మా వసూ ఏంటో మా వసూ..అనుకుని హాలిడే కదా ఇంట్లోనే ఉంటుందంటారా..అని అడుగుతాడు. తనేదే ప్లాన్ చేసుకుని ఉండొచ్చుకదా..కాల్ చేసి వెళ్తున్నారా అని అడుగుతాడు. ఏంటి సార్ మీరు.. వసూని కలవడానికి కాల్ చేసి వెళ్లాలా వసూ ఎవరు మా పక్కింటి అమ్మాయి.. చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటాడు శిరీష్..అయినా మీరు చెప్పాక నాకు డౌట్ వచ్చింది..అని శిరీష్ వసూకి కాల్ చేస్తాడు. ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఇంతలో రిషీ ఎటకారంగా.. మీకు ఈమధ్య ఆఫీస్ వర్క్ కేసులు అవిఇవి లేనట్లు ఉన్నాయ్ అంటాడు.. శిరీష్ అరే భలే చెప్పారు..మీకు ఎలా తెలుసు సర్ అని అడిగితే..అయితే మా కాలేజ్ లో లేకుంటే వసూ దగ్గర ఉంటారు అని రిషీ చెప్తాడు.
ఇంతలో వసూ రిషీకి కాల్ చేస్తుంది. వసూ వచ్చేలోగా శిరీష్ వెళ్తాడేమేలే అనుకుని కాల్ లిప్ట్ చేస్తాడు. కానీ తెలియనట్లు ఎవరూ అంటాడు. రిషీ సర్ నేను వసుధారని అంటుంది. రిషీ హా చెప్పండి. వసూ రాంగ్ నెంబర్కి చేశానా అనుకుని చెక్ చేసుకుంటుంది.కరెక్టే కదా అనుకుంటుంది. సార్ నేను బయటకొచ్చాను మీరెక్కడ ఉన్నారు అని అడుగుతుంది. రిషీ ఇక్కడే ఫ్రెండ్ తో ఉన్నాను అంటాడు. ఇంతోలనో వసుధార రిషీని చూస్తుంది. సార్ నేను మిమ్మల్ని చూశాను అంటుంది. శిరీష్ ఇంకేంటి విశేషాలు అని అడిగితే..రిషీ ఎటకారంగా..నేను ఈరోజు పేపర్ చదవలేదు అంటాడు. శిరీష్ గుడ్ జోక్ అంటూ నవ్వుతాడు. ఇంతలో వసూ వస్తుంది. శిరీష్ ను చూసి హే శిరీష్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నీకోసం వస్తున్నా అని శిరీష్ అంటాడు. రిషీ సర్ కనిపిస్తే ఆగాను అంటాడు.
వసూ ఓ అవునా మా ప్రోగ్రామ్ తెలిసే ఉంటుంది అని వసూ ఉంటుంది. ప్రోగ్రామ్ హా ఏం ప్రోగ్రామ్ అని అడుగుతాడు. అయితే నువ్వు నాతో ఇంటికి రావా అని అడుగుతాడు. నేనేలా వస్తాను..నాకు కాలేజ్ వర్క్ ఉంది. మేడమ్ ఇంట్లోనే ఉన్నారు అంటుంది వసూ. రిషీ..వసూ వెళ్దామా అని అడుగుతాడు. శిరీష్ నీకు ఫోన్ చేశాను బీజీ వచ్చింది అని అంటాడు. రిషీ వేరే కాల్ మాట్లాడి ఉండొచ్చు అని వసూని తీసుకెళ్తాడు. ఇద్దరు వెళ్లిపోతారు. శిరీష్ కి ఏం అర్థంకాదు.. వసూకి రిషీ గురించి ఒక ఫన్నీ మెసేజ్ పెడతాడు.
కారులో ఉన్న వసూ ఆ మేసేజ్ చూసి నవ్వుకుంటుంది. మీ సీరయస్ సింహం రిషీ సార్ పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సింది. నీ పాలిట యముడు.నీకు ఎప్పుడు విముక్తి దొరుకుతుందో అంటూ..వసూ నవ్వటం చూసి ఏంటి జోకా అంటాడు..లేదు సార్..శిరీష్ అంటూ సాగదీస్తుంది. రిషీ కోపంగా శిరీష్ మేసేజ్ చేశాడా అని కార్ పక్కకు ఆపుతాడు. నామీద ఏదో కామెంట్ చేశాడు కదా..ఏమంటున్నాడు చెప్పు వసుధార అంటాడు. పాపం వసూ నేను చెప్పలేను సర్ అంటుంది. ఆహా పెద్ద కామెంట్ హే చేశాడా..ఫోన్ ఇలా ఇవ్వు అని లాక్కుంటా‍డు. శిరీష్ మేసేజ్ చూస్తాడు. నీ అభిప్రాయం కూడా ఇదే కదా అని అడుగుతాడు. అయ్యో సార్ నేనెలా అనుకుంటాను చెప్పండి అంటుంది వసూ. ఎప్పుడో నువ్వు ఇదే మాట అని ఉంటావ్ అందుకే ఇప్పుడు పంపాడు అని రిషీ అంటాడు. లేదు సర్ నిజం నేను అలా అనుకోను అంటుంది. నిజమా నమ్మమంటావా అని రిషీ అడుగుతాడు. వసూ చేతిపై గిల్లి ఒట్టు అంటుంది. రిషీ హే ఇదేంటి అంటే..గిల్లొట్టు సార్..చిన్నప్పుడు మా స్కూల్లో ఇలానే ఒట్లు వేసుకునేవాళ్లం అంటుంది. నీ ఒట్టు ఏమోగాని నాకు మండతుంది అంటూ కార్ స్టాట్ చేస్తాడు.
ఇంకోసీన్ లో ధరణి జగతికీ ఫోన్ చేస్తుంది..అత్తయ్య మీరు చేసిన స్వీట్ చూసి నేను కూడా స్వీట్ చేయటం నేర్చుకున్నా అని ధరణి అంటుంది. వెరీగుడ్ ధరణి అంటుంది జగతి. నేను ఒకసారి స్వీట్ చేసి పంపిస్తాను మీరు టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి అంటుంది ధరణి.నువ్వు పంపించకున్నా నీ మనసు స్వీట్ అని నాకు తెలుసు అంటుంది జగతి..ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు.ఇంతలో దేవయాని వెనుక నుంచి వచ్చి ఎవరితో మాట్లుతున్నావ్ అని అడుగుతుంది..ధరణి భయంతో ఫోన్ కిందపడేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటే దెయ్యాన్ని చూసినట్లు చూస్తావ్..అంటూ కిందపడిన ఫోన్ తీస్కోబోతుంది.ఇంతలో మహేంద్ర వచ్చి వదినా మిమ్మల్ని అన్నయ్య రమ్మన్నారని చెప్తాడు. దేవయాని సరే వస్తున్నా అని…ఓసారి నువ్వరా నీతో మాట్లాడాలి అని చెప్పి వెళ్లిపోతుంది. ధరణి గండం గట్టెక్కినట్లే అనుకుని చినమావయ్యగారికి థ్యాంక్స్ చెప్తుంది.
ఇటుపక్క వసూ రిషీ స్లంమ్ ఏరియాకు చేరుకుంటారు. ఒకదగ్గర ఆగుతారు. ఇక్కడ నుంచి నడవాలి సర్ అంటుంది వసూ. నడవాలా..నడుస్తా నాకు నడక అంటే ఇష్టం అంటాడు రిషీ. వసూ నవ్వుతుంది. హలో ఏంటి నవ్వుతున్నావ్..నేను రోజు జాగింక్ చేస్తాను, మంచి ఫిట్ నెస్ ఉన్న బాడీ నాదీ అంటాడు. వసూ సర్ నాకు ఈరోజు సారీలకు థ్యాంక్స్ లకు పర్మిషన్ ఇవ్వాలి అని అంటుంది. ఎందుకో అని రిషీ అడిగితే..హాలీడే రోజు కూడా ఈ వర్క్ పెట్టున్నారు కదా అందుకు థ్యాంక్స్ అంటుంది. ఇంకోరకంగా చెప్తే బాగుంటుంది అని..చెయ్యిపట్టుకుని వసూ థ్యాంక్స్ చెప్తుంది. దాంతో రిషీ మనసు ఏటో వెళ్లిపోతుంది. బురదలో తంటాలు పడుతూ నడక ప్రారంభిస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version