గుప్పెడంతమనసు ఎపిసోడ్ 310: రిషీ కారుకు అడ్డం వచ్చిన బంటి..న్యాయం జరగాల్సిందే అని బయలుదేరిన వసూ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ వసూపై తన ప్రవర్తన గురించి ప్రశ్నించుకుంటాడు. నా మనసులో ఏముందే ఎవరో చెప్తేనే తెలియాలా..జగతి మేడమ్ చెప్పింది నా మనసు ఒప్పుకుందా..నా గురించి ఒకరు చెప్తే ఒప్పుకోను, నేనేంటో నేను తెలుసుకోను ఇదే నా నేను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మహేంద్ర వస్తాడు. ఏమైంది రిషీ అంటే..ఏమైంది డాడ్ అంటాడు రిషీ. చిరాక్గా కనిపిస్తున్నావు, ఎందుకో తెలుసుకోవచ్చా అంటే..రిషీ సంతోషంగా ఉన్నవాళ్లను అడిగితే బాగుంటుంది, చిరాకుగా ఉన్నవాళ్లను అడిగితే అని చెప్పబోతే..మహేంద్ర అర్థమైంది..ఇంకా చిరాకు పెరుగుతుంది అంటావు అంతేగా అంటాడు. సమాధానం తెలిసి ప్రశ్న అడగటం ఎందుకు అంటాడు రిషీ..ఇలా వీళ్లిద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. కట్ చేస్తే తెల్లారి మార్నింగ్ రిషీ ఇంట్లో అందరూ కలిసి కుర్చుంటారు..మినిష్టర్ కార్తీక్ మాస వనభోజనాలకు ఆహ్వానించారు. మనం అందరం వెళ్లాలి అని ఫణీంద్ర దేవయానికి చెప్తాడు. దేవయాని నేను రాను, మినిష్టర్ గారి ప్రోగ్రామ్ అంటే ఎవరెవరు వస్తారో నాకు తెలుసు, నేనెందుకులే అంటుంది. రిషీ పక్కన కుర్చుని మీరు వస్తాను అంటే నేను వెళ్తాను..లేదంటే నేను కూడా వెళ్లను అంటాడు. దేవయాని ఇక ఒప్పుకుంటుంది. సరే నాన్న వస్తాను అంటుంది.

ఇంకోవైపు జగతికి మినిష్టర్ ఫోన్ వనభోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇంతలో మహేంద్ర వస్తాడు. మహేంద్రకు జగతి విషయం చెప్తుంది. నేను రాలేను మహేంద్ర అంటుంది జగతి. వసూ బాగుంటాయ్ కదా మేడమ్ వనభోజనాలు వెళ్దాం మేడమ్ అంటుంది. అక్కడ దేవయాని అక్కయ్య ఉంటుంది, రిషీకి ఏదో ఒకటి చెప్పి గొడవ చేస్తుంది. మహేంద్ర నువ్వు రాకపోతే మినిష్టర్ గారు ఏమనుకుంటారు చెప్పు అంటే..నాకు రిషీ ముఖ్యం, మినిష్టర్ గారికి నేను క్షమాపణలు చెప్పుకుంటాను అంటుంది జగతి. మహేంద్ర నువ్వు రాకపోతే నేను రాను అంటాడు మహేంద్ర. నేను రాను అంటుంది వసూ. మొత్తానికి జగతి ఒప్పకుంటుంది.

మరుసటి రోజు జగతి, వసూ వనభోజనానికి రెడీ అయి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రిషీ కార్ హారన్ కొడతాడు. జగతి ఏంటి రిషీ సార్ కార్ హారన్ లా వినబడిందా అంటే..అవున అది రిషీ సార్ కార్ హారన్ హే..అని వెళ్లి తలుపుతీస్తుంది. రిషీ ఉంటాడు. రిషీ వసూ రెడీ హా వెళ్దామా అంటే..వసూ ఎక్కడికి సార్ అంటుంది. రిషీ జగతితో మేడమ్ వసూని నేను బయటకు తీసుకెళ్తున్నాను అంటాడు. వనభోజనాలు సార్ అంటే..మా కుటుంబాన్ని కూడా పిలిచారు. వసూ నేను కలిసివస్తాం. మధ్యలో మిషన్ ఎడ్యుకేషన్ లొకేషన్ ఒకటి చూస్తాం అంటాడు. వసూ ఈ ప్రోగ్రామ్ మిషన్ ఎడ్యుకేషన్ పనులు వద్దని మేడమ్ ఇంతకముందే చెప్పారు అంటుంది. జగతి అక్కడ మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్రస్తావన వద్దన్నాను కానీ, దారిలో వెళ్తూ చేస్తే ఏమవుతుంది. కరెక్టుగా విని, కరెక్టుగా అర్థంచేసుకోవాలి వసూ అంటుంది. నువ్వు వస్తున్నావా లేదా అని రిషీ అంటే..వస్తున్నాను సార్ అని వసూ జగతి వైపు చూస్తుంది. రిషీ ఏం మేడమ్..మీరు పర్మిషన్ ఇచ్చేవరకూ కదిలేలాలేదు..మెయిల్ ఏమైనా పెట్టమంటారా అంటాడు. జగతి ఈ మధ్య రిషీకి వెటకారం ఎక్కువైంది అనుకుని అవసరం లేదు సార్ అంటుంది జగతి. వసూ రిషీతో వెళ్తుంది. జగతి వీళ్లు చెప్పేది నిజమా లేక కల్పితమా ఏమో ఎవరికి తెలుసు అనుకుంటుంది.

కారులో వెళ్తున్న వసూ..రిషీతో సార్ మిషన్ ఎడ్యుకేషన్ కోసం లొకేషన్ ఎక్కడ దొరికింది సార్ అంటే..ఈ దారిలో విలేజ్ ఉందని తెలిసింది చూద్దామని అనుకున్నాను..నీకు ఏమని అనిపిస్తుంది..అబద్ధాలు చెప్పి నిన్ను మీ మేడమ్ గారి దగ్గర నుంచి తీసుకువచ్చా అనుకున్నావా అంటాడు రిషీ. అబ్బే అలాంటిది ఏం లేదు సార్. ఈ మధ్య కాలంలో మీలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది సార్ అంటుంది వసూ. ఏంటది అంటే..ఇది అది అని లేదు కానీ..ఏదో కొత్తదనం కనిపిస్తుంది సార్ అంటుంది వసూ. రిషీ మనసులో నాకూడా నాలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది, అదేంటో తెలియటం లేదు, వసుధార మీద కోపం తగ్గిపోయిందా అనుకుంటాడు. వసూ ఏం ఆలోచిస్తున్నారు అంటే..ఏం లేదు ఈ వనభోజనాలు గురించి వినడమే తప్ప ఎప్పుడు వెళ్లింది లేదు అంటాడు రిషీ..వసూ తన వాళ్ల ఊర్లో వెళ్లింది, ఆ జ్ఞాపకాలు చెప్తుంది. వాళ్లు అలా మాట్లాడకుంటూ ఉండగా..ఒక చిన్నఅబ్బాయి కారుకు అడ్డంగా నుల్చుని ఏడుస్తాడు. రిషీ పక్కనుంచి వెళ్దాం అంటే..దిగి వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకుని వెళ్దాం అంటుంది. ఆ పిల్లాడు గోలీల ఆటలో తన ఫ్రెండ్ మోసం చేసి గోలీలు లాగేసుకున్నాడని ఏడుస్తాడు. వసూ వాడి కష్టం తీరుస్తా అని ఆ పిల్నాడ్ని తీసుకుని పిల్లలు ఆడే ప్లేస్ కి వెళ్తుంది. ఏంటి వసూ ఏమైంది అంటే..వసూ విషయం చెప్తుంది. గోలీలతో మొదలైన మోసం పెద్దయ్యాక ఎక్కడివరకూ వెళ్తుందో తెలియదు కదా సార్ అంటుంది వసూ. అవును, ఇప్పుడు ఏం చేయబోతున్నావ్ అంటే..చూడండి సార్ మీరే అంటుంది వసూ. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version