గుప్పెడంతమనసు ఎపిసోడ్ 261: తల్లికి షెకాండ్ ఇచ్చిన రిషీ..నా మీద మీ అభిప్రాయం ఏంటని రిషిని అడిగేసిన వసూ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో దామోదర్ వస్తాడు. ఆయనకు అందరు వెల్కమ్ చెప్తారు. ఆయన వెళ్లి కుర్చుంటాడు. జగతి శిరీష్ ని పిలిచి ఈ షోకు వోట్ ఆఫ్ థ్యాంక్స్ నువ్వే చెప్పాలి అంటుంది. శిరీష్ నాకు కొంచెం స్టేజి ఫియర్ మోడమ్ అంటాడు. ఇది యూత్ షో కదా యూత్ చెప్తేనే బాగుంటుంది అంటుంది జగతి. మహేంద్ర.. ఆఫీసర్ మీకు ఇచ్చే గౌరవం లాంటిది అనుకుండి ధైర్యంగా చేయండి అంటాడు. రిషీ టైం అయిపోతుంది స్టాట్ చేద్దామా అంటాడు. షో స్టాట్ అవుతుంది. వసూ డ్యాన్స్ చేస్తుంది. శిరీష్ వసూ డ్యాన్స్ చేస్తుంటే..మహేంద్ర శిరీష్ ప్లేస్ లో రిషీని ఊహించుకుంటాడు. అందరు క్లాప్స్ కొడుతున్నా మహేంద్ర ఇంకా అదే భ్రమలో ఉంటాడు. జగతి ఏమైంది అంటే అప్పుడు మహేంద్ర రిషీని చూస్తాడు.
ఆ తర్వాత జగతి స్టేజ్ పైకి వెళ్లి స్పీచ్ ఇస్తుంది. అనంతరం వసుధార ట్రెడిషనల్ గెటప్ లో డ్యాన్స్ చేస్తుంది. రిషీ మంత్రముగ్ధుడై చూస్తూ..వసుధారేనా అనుకుంటాడు. వసుధార అక్షరం, అధ్యయనం, ఆచరణ పదాలను వివరిస్తూ చక్కగా డ్యాన్స్ చేస్తుంది. మహేంద్ర రిషీతో వసుధార ఎంతమంచి డాన్యర్ కదా రిషీ అంటాడు. రిషీ..డాడ్ వసుధార చాలా కష్టపడి రిహార్సల్స్ చేసి డ్యాన్స్ చేస్తుంది. చూడండి, డిస్టబ్ చేయకండి అంటాడు. వసూ పర్ఫామెన్స్ అయిపోతుంది. అందరూ లేచినిలబడి క్లాప్స్ కొడతారు. శిరీష్ స్టేజి ఎక్కి వసూ సూపర్ నువ్వు అద్దరగొట్టేశావ్ అంటాడు. జగతి శిరీష్ తర్వాత మీదే అంటుంది. శిరీష్ స్పీచ్ మొదలుపెడతాడు. కానీ సరిగ్గా చెప్పలేక, తడబడతాడు. అందరూ షాకై చూస్తారు. ఇంతలో రిషీ స్టేజ్ ఎక్కి స్టాట్ చేస్తాడు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. రిషీ స్పీచ్ ఇస్తుంటే తల్లి మరిసిపోతుంది. వసూ షాకై రిషీ వైపు చూస్తూ ఉండిపోతుంది. అందరూ క్లాప్స్ కొడతారు. రిషీ శిరీష్ దగ్గరకు వెళ్లి తన చేయి పట్టుకుని మందుకు తీసుకొస్తాడు.. ఫస్ట్ శిరీష్ ఏంటి ఇప్పుడు ఇక్కడే క్లాస్ ఇస్తాడేంటి అనుకుంటాడు. కానీ రిషీ తనకు ఏం సంబంధం, అవసరం లేకున్నా తన సమయాన్ని కేటాయించినందుకు డీబీఎస్టీ కాలేజ్ తరుపున ఏసీపీ శిరీష్ కి కృతజ్ఞతలు చెప్పి స్టేజ్ దిగుతాడు. అందరు కంగ్రాస్ట్ అంటారు. జగతి కూడా కంగ్రాస్ట్ అని చెయి మందుకు పెడుతుంది. రిషీ ఫస్ట్ చేయి ఇవ్వడు..కానీ తరువాత షెకాండ్ ఇచ్చి థ్యాంక్యూ మేడమ్ అంటాడు. అంతే జగతి ఆనందానికి హద్దులు ఉండవు.
రిషీ వసూని వెతుకంటూ మేకప్ రూంలోకి వెళ్తాడు. వసూతో బాగా చేశావ్ వసుధార అంటాడు. వసూ థ్యాంక్సూ సార్ అంటుంది. వాయిస్ చెప్పావ్ చూడు అదికూడా బాగుంది అంటాడు. వసూ రిషీ చెప్పిన ముగింపు మాటలు గొప్పగా చెప్పారు, మిమ్మల్ని చూస్తుంటే గొప్పగా, గర్వంగా ఉంది అంటూ థ్యాంక్స్ చెప్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో వసూ-రిషీ రెస్టారెంట్ లో ఉంటారు. రిషీ వసూకి నెమలీక ఇచ్చి, ఇలాంటి జ్ఞపకాలు నీకు చాలా ఉంటాయి కదా అంటాడు. అవును సార్ అని మీరు కోప్పడను అంటే మీమ్మల్ని ఓ మాట అడగాలి సార్ అంటుంది. అడుగు అంటాడు రిషీ. నా మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అని వసూ అడుగుతుంది. రిషీ ఏం చేప్తాడో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news