కార్తీకదీపం ఎపిసోడ్ 1162: ట్విస్ట్ అదిరింది. కార్తీక్ తో మోనిత మాట్లాడిన మాటలను వినేసిన హిమ

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ సౌందర్య ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ బాధపడతారు. హిమ ప్రవర్తన పై కార్తీక్ దిగాలుగా ఉంటాడు. సౌందర్య ప్రతిసారి నువ్వు నీ వైపు నుంచే ఆలోచిస్తున్నావు, ఒకసారి దీపవైపు నుంచి కూడా ఆలోచించు. ప్రతి విషయాన్ని గుచ్చిగుచ్చి అడుగుతూ దాన్ని ఇబ్బందిపడెడుతున్నారు. ఇలా పిల్లల గురించి మాట్లాడుకుంటారు. సౌందర్య కార్తీక్ కు ధైర్యం చెప్తుంది..కాలానికి ఎదురీదితీనే మన బలమేంటో తెలుస్తుంది..నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండు అంటుంది. ఇంకోవైపు దీప హిమ అన్న మాటలను తలుచుకుని..ఈ పిల్లలకు ఏమైంది, రోజురోజుకి సమాధానాలు పుట్టులేని ప్రశ్నలుసందిస్తున్నారు అనుకుంటుంది. జైల్లో మోనిత అన్న మాటలను, కారులో వారణాసి అన్న మాటలను తలచుకుంటూ ఉంటుంది.
తెల్లారి జైల్లో మోనిత కొత్త నాటకానికి తెరదించుతుంది. హార్ట్ యటాక్ అని నాటకం ఆడుతుంది. సుకన్య ఇంకా కొంతమంది వచ్చి హాస్పటల్ కి పంపిద్దాం అని ఆంబులెన్స్ కి కాల్ చేస్తారు. మోనిత సుకన్యకు సైగ చేస్తుంది. గవర్నమెంట్ హాస్పటల్ కి కాదు..వాళ్ల హాస్పటల్ కి పంపమని చెబుతుంది. సర్లే ఏదో ఒకటి చేయండని అక్కడున్న ఆఫీసర్ చెప్పి వెళ్లిపోతుంది.
ఇంకోవైపు ఇంట్లో హిమ స్కూల్ కి వెళ్లటానికి దీప రెడీ చేస్తూ ఉంటుంది. శౌర్య ఎక్కడుంది అంటే శౌర్కకు ఏమైందో తెలియదు సడన్ గా కాలునొప్పితో ఎంట్రీ ఇస్తుంది. శౌర్య నేను కూడా స్కూల్ కి వెళ్తా అంటుంది. దీప ఒప్పుకోదు. హిమను తీసుకుని కిందకు వస్తుంది. హిమ..అమ్మా డాడీ ఏడి అంటుంది. దీప మనసులో హమ్మయ్య దీని అలకతీరినట్లుంది అనుకుంటుంది. ఆపరేషన్ ఉందని పొద్దున్నే వెళ్లిపోయారు అని చెప్పి ఎందుకమ్మా డాడీని పలకరిస్తావా, బాయ్ చెప్తావా అంటే..సారి చెప్తానమ్మా అంటుంది. ఆ మాటకు సోఫాలో కుర్చున్న సౌందర్య లేచి హిమను ముద్దు పెట్టుకుని ఈ మాట వింటే మీ డాడి ఎంత సంతోషిస్తాడో అంటుంది. వారణాసిని పిలిచి జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్లో దింపేసి రా అంటుంది.
karthika-deepamమరోపక్క మోనితను హాస్పటల్ కి తీసుకొస్తారు. కార్తీక్ కూడా అక్కడే ఉంటాడు. ఇంతలో డాక్టర్ భారతి వస్తుంది. కార్తీక్ రావటం చూసి భారతి భయపడుతుంది. మోనితను ఎమర్జన్సీ వార్డ్ లోకి తీసుకెళ్తారు. ఛీ ఈ సీన్ చాలా చిరాకుగా ఉంటుంది. భారతీతో శారీ అరెంజే చేయించుకుంటుంది. కార్తీక్ ఖైదీ శారీలో చూస్తే బాగోదంట అందుకే ఈ మోనిత రెడీ ఐ కనిపిస్తుందంట. హిమ కూడా స్కూల్ కి వెళ్లకుండా హాస్పటల్ కి వచ్చి కార్తీక్ కోసం వెయిట్ చేస్తుంది.
ఇంట్లో దీప మోనిత మాటలను తలుచుకుని బాధపడుతుంది. సౌందర్య వచ్చి ఏంటే ఏమైంది అని అడుగుతుంది. దీప ఆ మోనిత ధైర్యం ఏంటో నాకు అర్థంకావట్లేదు , తప్పు తన వైపే ఉన్నా ధైర్యంగా మాట్లాడుతుంది. అసలు నా జీవితం ఏంటి ఇలా అవుతుంది అంటూ..దీప ఏడ్చుకుంటూ బాధపడుతుంది. సౌందర్య సేమ్..కార్తీక్ కి ధైర్యం చెప్పినట్లు ఇక్కడ దీపకు కూడా నాలుగు ధైర్యం నింపే మాటలు చెప్తుంది. ఈ సమస్య అంతా నా కొడుకు వల్లే వచ్చింది అని గతాన్ని గుర్తుచేసుకుంటారు. ఈ విపరీతమైన పరిస్థితుల్లో నేను ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, కంటికి ఎదురుగా నీ బాధను చూస్తూ ఏం చేయలేకపోతున్నాను అంటుంది సౌందర్య. దీప ఈ విషయంలో మీరు ఏం చేయలేర అంటుంది. నేను ఏం చేయలేకపోవటం అటుంచి..నువ్వు ఆ దేవుడ్ని నిలదీస్తావో. నీ పతిదేవుడ్ని నిలదీస్తావో నాకు తెలియదు అంటుంది. ఇంతలో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అసలు ట్విస్ట్ రేపటి ఎపిసోడ్ లో ఉంది. శౌర్య చేతిలో ఆ పేపర్ చూసి దీప లాక్కోబోతుంది. శౌర్య ఈ పేపర్ లో ఉన్నది చదివేశానమ్మా అంటుంది. దీప షాక్. ఇటుపక్క ఈ మోనిత టిప్ టాప్ గా రెడీ ఐ కార్తీక్ తో నీలా నేను పిల్లలకు అబద్ధం చెప్పలేను కార్తీక్ నా కడుపులో బిడ్డకు తండ్రివి నీవే అని అంటుంది. ఈ మాటలను వెనక నుల్చున్న హిమ వింటుంది. ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.