కార్తీకదీపం ఎపిసోడ్ 1175: జైలు నుంచి విడుదలవుతున్న మోనిత..పిల్లలకు నిజం చెప్పేస్తున్న దీప

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమ విహారిని మా అమ్మమీకు ఎలా తెలసు, మా డాడీకి మీరంటే ఎందుకు కోపం అంకుల్ అని అడుగుతుంది. ఏం మాట్లాడరు. అందరు బిత్తరపోయి చూస్తారు. ఈ పిల్లకేదో తెలిసినట్లుంది, వీళ్లేం చెప్పినట్లు లేరు, నేను రావాల్సింది కాదేమో అనుకుని అలా ఏం లేదమ్మా, మీ నాన్నకు నా మీద కోపం ఎందుకు ఉంటుంది, మేం మేం ఫ్రెండ్స్ అమ్మా అంటుంది. అయినా హిమ నమ్మదు. ఇంకా నమ్మినట్లులేదు అనుకుని మళ్లీ చెప్తాడు. ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను, ఫ్రెండ్స్ హే కదా కలవటానికి వస్తాం..ఏం తులసి మాట్లాడవేంటి అని అంటాడు. ఏం కార్తీక్ గారు ఏం మాట్లాడరేంటి, మీ పాపభలే జోకులేస్తుంది అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేసి హ్యీపీ జర్నిఅని చెప్పి వెళ్లిపోతాడు. సౌందర్య ఏంటేనువ్వు ఇంట్లోవాళ్లతో, ఇంటికొచ్చినవాళ్లతో ఒకేలా మాట్లాడతావా అంటుంది. ఆ విహారీ అంకుల్ కూడా మీలాగే అబద్ధాలు చెప్తున్నారు కదా అంటుంది హిమ. నేను డైరీ చదివాను నానమ్మ లేకకపోతే నాకు విహారి అంకుల్ గురించి, దీపారాధన బుక్ గురించి ఎలా తెలుస్తుందో చెప్పండి..ఆ డైరీలో డాడీ అంకుల్ పేరు రాసి అని చెప్పబోతుంది. కార్తీక్ ఇక ఆపు హిమ అని చేయ్ కడిగేసుకుని బయటకువస్తాడు.
బయట విహారివాళ్లు అప్పుడే కారు ఎక్కబోతారు. కార్తీక్, దీప బయటకువచ్చి అక్కడ అందరిముందు ఏం మాట్లాడాలో తెలియలేదు అని కార్తీక్ అంటాడు. పర్లేదు కార్తీక్ గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చేదుజ్ఞాపకాలు అన్నీ మర్చిపోయి కొత్తజీవితాన్ని మొదలుపెట్టండి అని హ్యాపీజర్నీ చెప్పి వెళ్లిపోతారు. కారులో వెళ్తూ..విహారి చిన్న అపార్థం విలువ పదొకొండేళ్ల ఎడబాటు అంటాడు. అనుమానం ఆడవాళ్లలో మగవాళ్లలో ఒకేలా ఉండదు అని తులసి అంటుంది. ఇలా వీళ్లీద్దరు మాట్లాడుకుంటూ ఆడవారి ప్రేమగురించి చెప్పుకుంటారు. ఏది ఏమైనా కార్తీక్ అలా చేసి ఉండాల్సింది కాదేమో అంటాడు. వాళ్లు అమెరికా వెళ్తే వాళ్లను మళ్లీ చూసే వీలుండదు అంటాడు విహారి. కార్తీక్ అమెరికా వెళ్లటం లేదండి, పారిపోతున్నాడు అంటుంది తులసి. ఇలా వీళ్ళిద్దరు ఏదోఒకటి మాట్లాడుకుని లాగ్ చేస్తారు.
సౌందర్య, ఆనంద్ రావులు హాల్లో కుర్చుని ఉంటారు. కార్తీక్ నైట్ డ్రెస్ లో వచ్చి మమ్మీ ఓ సారి హాస్పటల్ కి వెళ్లివస్తాను అంటాడు. ఏంట్రా ఈ డ్రస్ లోనా అంటుంది సౌందర్య. నా అడ్రస్ హే మారిపోతుంది…ఇంకా నా డ్రెస్ ఏదైతే ఏమవుతుందిలే అంటాడు. వెళ్లిరారా త్వరగా రారా ఫ్లైట్ టైం గుర్తుందిగా అంటుంది. ఇక్కడే ఏదో ట్విస్ట్ ఉండి ఉంటది. ఆనంద్ రావు వచ్చి కార్తీక్ నువ్వక్కడే ఉండు నేనే వస్తాను, ఇప్పటిదాకా నువ్వేసిన వెనకడుగులు చాలు అని కార్తీక్ ని కౌగిలించుకుని ఏడుస్తాడు. ఏది ఏమైనా నువ్వు నా పెద్దకొడుకివిరా, వెళ్లు నాన్న వెళ్లు త్వరగా వచ్చే అంటాడు.
ఆనంద్ రావు ఏడుస్తూ..పాపం ఇన్నేళ్లలో వాడు మనస్సాంతిగా ఉంది ఎప్పుడు సౌందర్య అంటాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటుంది సౌందర్య. నన్ను మాట్లాడనీ సౌందర్య అని గతాన్ని గుర్తుచేసుకుంటాడు. అందరం వాడ్ని దూరంపెట్టాము. అందరివంతు అయిపోయాక ఆ మోనిత కక్ష తీర్చుకుంది. ఇప్పుడు పిల్లల వంతు వచ్చింది. ఇన్ని జరుగుతుంటే వాడెప్పుడు సంతోషంగా ఉంది అని బాధపడతాడు.
వారణాసి ఆటోలో దీప ఇంటికి వచ్చి..వారణాసికి జాగ్రత్తలు చెప్తుంది. అమ్మను బాగా చూసుకోరా అంటుంది. మళ్లీ అమెరికానుంచి ఎప్పుడు వస్తారు అక్కా అంటాడు. తెలియదురా అసలురావొద్దనే కోరుకో అంటుంది దీప. నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అని దీప ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక్కడ అక్కాతమ్ముళ్ల ప్రేమ బాగా చూపిస్తారు. ఈ సీన్ ఎమోషన ల్ గా బాగుంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయిభాగంలో ఉంది అసలైన ట్విస్ట్.. మోనిత కూడా విడుదలై వస్తున్నట్లు పేపర్ లో వేస్తారు. సరిగ్గా అమెరిగా వెళ్లేరోజు ఇది విడుదలై రావాలా అని దీప అనుకుంటుంది. వస్తే ఏమవుతుందే అంటుంది సౌందర్య. ఈ పేపర్ దాచేద్దామా అక్కా అని శ్రావ్య అంటుంది. దీప పిల్లలు ఇద్దరిని పిలిచి ఆ పేపర్ ఇస్తుంది. ఇది ఈరోజు పేపర్, మోనిత ఆన్టీ విడుదలై జైలు నుంచి వస్తున్నట్లు రాశారు అని ఇస్తుంది. అసలేం జరుగుతందో వాళ్లు అమెరికా వెళ్తారో లేదో రేపు చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news