కార్తీకదీపం ఎపిసోడ్ 1210: ఫంక్షన్ కు మోనిత రాదనుకోని ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ రావు, సౌందర్యలు..ట్విస్ట్ ఇచ్చిన మోనిత

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమ, శౌర్యలు వాళ్ల మమ్మీడాడీల గురించి మాట్లాడుకుంటారు. శౌర్య బస్తీలో ఇళ్లు కట్టుకోబోతున్నావ్ అని హిమకు చెప్తుంది. హిమ ఫుల్ హ్యాపీ. మొన్న ఆదిత్య బస్తీమాట ఎత్తొద్దని కోప్పపడింది గుర్తుకొచ్చి హిమ మరి భాబ్భై అలా అన్నాడుగా అంటే..దానికి శౌర్య ఏదోఒకటి చెప్పి కవర్ చేస్తుంది. అలా వాళ్లు కబుర్లు చెప్పుకుంటారు.

karthika-deepam

మరోపక్క మోనిత బస్తీ సీన్ తలుచుకుని నవ్వుతుంది..ప్రియమణి.. అంత అవమానం జరిగితే ఇలా నవ్వుతుంది ఏంటీ’ అనుకుంటుంది. ‘ఏంటి ప్రియమణి నేనేంటో అర్థం కావట్లేదా? నా ప్రేమ గొప్పది ప్రియమణి.. దాని గురించి ఎవరికీ అర్థం కావట్లేదు అంతే.. నేనే అర్థమయ్యేలా చేయటం నా ధర్మం కదా..చేస్తాను. దీపకి ఊహించని జలక్ ఇస్తాను’ అంటుంది నవ్వుతుంది. ఇంతలో ప్రియమణి.. ‘అమ్మా మీరు తేల్చుకోవాల్సింది కార్తీక్ అయ్యతో కదా.. మధ్యలో పాపం దీపమ్మ ఏం చేస్తుంది?’ అంటుంది. మోనిత చలిపెడుతుంది..వెళ్లి ఫ్యాన్ ఆఫ్ చేయమని ‘ప్రియమణికి చెప్తుంది. ప్రియమణి ఫ్యాన్ ఆఫ్ చెయ్యగానే.. ‘చూశావా.. ఫ్యాన్ ఆఫ్ చెయ్యమంటే నువ్వు ఫ్యాన్ దగ్గరకు వెళ్లకుండా స్విచ్ దగ్గరకు వెళ్లావ్.. అలాగే నా కార్తీక్ లైట్.. ఆ దీప స్విచ్..నా లైట్ వెలగాలంటే.. ఆ దీప అనే స్విచ్ నొక్కాల్సిందే.. చూస్తూ ఉండు రేపు సరికొత్త పథకం అమలు కాబోతోంది..గుడ్ నైట్ ప్రియమణి అంటుంది.

తెల్లారి ఉదయం సౌందర్య దేవుడికి పూజచేసుకుని.. సోఫాలో కుర్చుంటుంది. దీప కాపీ తెచ్చి ఇస్తుంది. ఎంత అందంగా నవ్వుతావే నువ్వు..ఇలానే నవ్వుతూనే ఉండాలి ఎప్పుడూ ఉండాలి అంటుంది. ఇదంతా నా పతిదేవుడి దయ అంటుంది దీప. మరి ఇంకా ఈ పతిదేవుడు లేవలేదా అంటుంది.ఇంతలోనే కార్తీక్ వస్తాడు. వచ్చిరాగానే..కొన్ని పనులు ఉన్నాయ్ చూసుకుని వస్తాను, నువ్వు రెడీ అయ్యి ఉండు..బస్తీలో స్థలం చూడ్డానికి వెళ్దాం అంటాడు. నేను ఇలా అడగగానే అలా చేసేస్తున్నారు అంటుంది దీప. ఇలా అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. కార్తీక్ డాక్టర్ యూనియన్ ప్రసిడెంట్ గా నన్ను ఏకగ్రీవంగా ఉండమన్నారు..వెళ్దాం త్వరగా రెడీ అవ్వు అంటాడు.

ఇంకోపక్క మోనిత దీప గురించి ఆలోచిస్తూ..ప్రియమణిని పిలిచి బుర్ర వేడెక్కుతుంది..ఓ స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అంటుంది. ప్లాన్లు మీద ప్లాన్లు వేస్తే ఎందుకు వేడెక్కదు అనుకుంటుంది ప్రియమణి. డాక్టర్ భారతి ఫోను చేసి నువ్వు వస్తున్నావా అంటే..ఎక్కడికి అంటుంది మోనిత. భారతి డాక్టర్స్ అసోసియోషమ్ మీటింగ్ ఉందికదా..అందరూ కలిసి కార్తీక్ ను ఎన్నుకుంటున్నాం నువ్వు రావా అంటే..మోనిత నాకు ఈ ఎన్నికలు, పదవులు, మీటింగ్ మీద ఇంట్రస్ట్ లేదు నేను రాను అని ఫోన్ కట్ చేస్తుంది.

కార్తీక్, దీప కారులో వస్తుంటారు. కార్తీక్ భారతికి ఫోన్ చేసి మోనిత వస్తుందా అని అడుగుతాడు. రావట్లేదు అని చెప్తుంది. మంచిది అని కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. తను రావట్లేదనేసరికి…కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకవేళ అది వచ్చిన మిమ్మల్ని లోపలికి పంపించి..నేను కర్రపట్టుకుని నుల్చుంటా అంటూ జోక్ లు వేస్తుంది.

ఇంట్లో ఆనంద్ రావు, సౌందర్యలు ఫంక్షన్ కు బయలుదేరుతారు. ఆదిత్య వచ్చి ఎక్కడకో బయలుదేరినట్లు ఉన్నారు అంటే..సౌందర్య విషయం చెప్తుంది. మీరెందుకు మమ్మీ..అక్కడకు ఆ మోనిత వచ్చి ఏదో ఒక గోల చేస్తుంది అవసరమా అంటాడు ఆదిత్య. ఈ మాత్రం మీ అన్నయ్య ఆలోచించడు అనుకున్నావారా..అది రావటం లేదని తెలిశాకే మేము రెడీ అయ్యాం అంటుంది సౌందర్య. ఆనంద్ రావు మీరు కూడా రండిరా అంటే..దీపగాడ్ని తీసుకురావడానికి వెళ్తున్నాం అంటాడు ఆదిత్య.

ఇక్కడ మోనిత కార్తీక్ ఫొటో పట్టుకని..ఎంటి కార్తీక్ నువ్వు ఇంకేం చేస్తే నా ప్రేమను అర్థంచేసుకుంటావ్ అనుకుంటూ ఫోటోతో తన బాధను చెప్పుకుంటుంది. ఇందతం దొంగచాటుగా ప్రియమణి వింటుంది. మోనితమ్మ మనసేంటో, తన ఆలోచనలేంటో, ఆ ఫోటోతో మాట్లాడటం ఏంటో నాకేం అర్థంకావట్లేదు అనుకుంటుంది. మోనిత దీపక్క ఉన్నంతవరకూ నాకు అడ్డుపడుతూనే ఉంటుంది. దీప అడ్డుతొలగించాలి, ఎలా అనుకుంటుంది. ఈ తొక్కలో శపధాలు చేస్తుంది. ప్రియమణిని పిలిచి ఏంటి చాటునుంచి చూస్తున్నావ్..నాది చాటుమాటు ప్రేమ కాదు..లీగల్ ప్రేమ, చట్టబద్ధంగా నేను కార్తీక్ ను దక్కించుకుంటాను చూస్తూ ఉండూ ప్రియమణి అంటుంది. ఇక్కడ కార్తీక్, దీపలు ఫంక్షన్ హాలుకి వస్తారు. ఎపిసోడ్ అయిపోతుంది. వీళ్ల లాగ్ లతో ఫంక్షన్ ఎపిసోడ్ రేపటికి పడింది.