కార్తీకదీపం 1208: బస్తీలో మోనితకు బడితపూజ..అనుకున్నది ఒక్కటి అయ్యింది మరొకటి..!

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో ఆనంద్ రావు, సౌందర్యలు ఈరోజు నాకు చాలా హాయిగా ఉందండి అనుకుంటూ మాట్లాడుకుంటారు. కంటినిండా నిద్రపోయాను అని ఆనంద్ రావు అంటాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగా..పిల్లలు మేము కూడా వాకింగ్ కి వస్తాం అంటారు. సరే వెళ్లి అమ్మకు చెప్పిరండి అంటుంది. ఇంతలో బయట మోనిత క్యాబ్ లో కార్తీక్ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రియమణి మన కారు ఉండగా..క్యాబ్ ఎందుకు తీసుకున్నారు, కార్తీక్ ఇంటికి వచ్చి మనం బయట ఎందుకు ఉన్నాం అంటుంది. నా ప్లాన్స్ నాకు ఉంటాయి విసిగించకు, మన కారు అయితే..కార్తీక్ వాళ్లు గుర్తుపడతారు, కార్తీక్ ఎక్కడికి వెళ్తే మనం తనని ఫాలో అవ్వాలి అంటుంది మోనిత. ఇంట్లో కార్తీక్ కు దీప టవల్ తో తల తుడుస్తూ..భలే ఎంజాయి చేస్తారు. వాళ్లు అలా నవ్వుకోవటం చూసిన పిల్లలు మనం వాళ్లను ఇంకెప్పుడు విసిగించకూడదు అనుకుంటారు. కార్తీక్ మీరెప్పుడు వచ్చారా అంటే..మేము నాన్నమ్మవాళ్లతో వాకింగ్ కి వెళ్తున్నాం అంటారు. సరే అంటుంది దీప.
కారులో ఉన్న  ప్రియమణి..ఏంటమ్మా మనకు ఈ కష్టాలు, హాయిగా ఇంట్లో ఉండేదానికి అంటుంది. వాళ్లు చూస్తే గొడవలు అవుతాయి అంటుంది. ఎంత గొడవ అయితే అంత లాభం మనకు అంటుంది. ఇంతలో వాకింగ్ కి పిల్లలతో ఆనంద్ రావువాళ్లు వస్తారు. వాళ్లను చూసి మోనిత వాళ్లు దాక్కుంటారు. ఇంట్లో కార్తీక్, ఆదిత్యలు టిఫెన్ చేస్తుంటారు. ఆదిత్య సరదాగా మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేయండి అన్నయ్య అంటుంది. కార్తీక్ గతంలో టూర్ కు వెళ్లి జరిగిన సీన్ గుర్తుచేసుకుని…వద్దులే అంటారు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా..మురళీకృష్ణ వచ్చి ఇంటిబయట కారులో మోనిత కుర్చుంది అని దీపను పక్కకు పిలిచి చెప్తాడు. ఎవరూ లేనప్పడు చెప్పు అంటే..అలాంటి దాపరికాలు చేస్తేనే..నా కాపురం ఇక్కడ వరకూ వచ్చిందని..వెళ్లి కార్తీక్ కు చెప్తుంది. తనకు ఇంకా బుద్దిరాలేదా అని ఆదిత్య అంటాడు. గొడవపడటానికి వెళ్తే.. వద్దులే ఆదిత్య తన సంగతి మేం చూసుకుంటాం అంటారు కార్తీక్, దీప.
ఇంకోపక్క బస్తీలో మెడికల్ క్యాంప్ కు వారణాసి వాళ్లు హడావిడి చేస్తుంటారు. కారులో దీప, కార్తీక్ బస్తీకి బయలుదేరుతారు. ఇంటి బయట మోనిత ఉందని నాన్న చెప్పారు అని దీప చుట్టూ పార చూస్తుంది. మోనిత కనపించదు. మీ నాన్న ఏదో భ్రమపడినట్లు ఉన్నారు అనుకుని కారు స్టాట్ చేస్తారు. మోనిత అక్కడే ఉంటుంది..కార్తీక్ వాళ్లను ఫాలో అవుతుంది. బస్తీలో కార్తీక్ అందరికి వైద్యం చేస్తారు. దీప అక్కడివాళ్లతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఒక ఆవిడ కార్తీక్ తో వాళ్ల నాన్న కోసం మా అబ్బాయి ఏడుస్తాడు, ఆడపిల్ల పుట్టలేదని వెళ్లిపోయాడు అంటుంది ఆమె. అలా ఎలా వదిలేసి వెళ్లిపోయాడు, చిన్నపిల్లలను వదిలేస్తాడు, మనిషేనా, మనసనేదా లేదా, కన్నతండ్రికాదా అంటాడు. సరిగ్గా అదే టైంకి మోనిత ఎంట్రీ ఇచ్చి..ఇదే మాట నేను నిన్ను అడిగితే..నా బిడ్డను నన్ను వదిలేశాం..ఇక్కడకు వచ్చి పెద్ద ఆదర్శమూర్తిలా బిల్డప్ ఇస్తున్నావ్ అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో మోనిత ఓ పేట్రేగిపోతుంటే…దీప అసలు ఆ బిడ్డకు డాక్టర్ బాబుకు ఏ సంబంధంలేదని చెప్తుంది. బస్తీలో ఉండే ఆడవాళ్లంతో చీపుర్లు తెచ్చుకుని..మోనిత మీదకు వెళ్తారు. ఏంటమ్మా నీ గొడవ అని మోనితను కొట్టేదానికి రెడీగా ఉంటారు. రేపు చూడాలి..మోనితకు ఇంకెలాంటి అవమానం ఎదురవుతుుందో.