కార్తీక మాసంలో వనభోజనాలను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. బంధువులు, స్నేహితులను పిలిపించుకుని ఎంతో పవిత్రంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు. అనంతరం అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. అంతా కలిసి శివుడిని ఆరాధిస్తారు. అయితే తాజాగా పవిత్రంగా జరుపుకునే కార్తీక వనభోజనాల్లో పాడుపనులు చేశారు. దాంతో సమాచారం అందిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటన ఆకివీడు దుర్గానర్ లో శుక్రవారం చోటు చేసుకుంది. దుర్గానగర్ లో కార్తీకవన భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే వనభోజనాల మాటున రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అశ్లీల కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.