వాస్తు అంటే దాదాపు అందరూ విశ్వసిస్తారు. శాస్త్రీయంగా గాలి, వెలుతురు ప్రసరిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే నియమాలే వాస్తు. అయితే చాలామందికి వాస్తు పరంగా పలు సందేహాలు.. వీటిలో ప్రధానంగా సింహద్వారం విషయం పరిశీలిద్దాం. పేర్లను బట్టి సింహద్వార నిర్ణయం చేస్తారు. అయితే ఏ పేరువారికి ఎటు దిక్కుగా సింహద్వారాన్ని పెట్టాలో సరళంగా తెలుసుకుందాం…
పేరులోని మొదటి అక్షరం | వర్గు | సరిపోయే సింహద్వారం |
అ నుంచి ఆః వరకు | అ | ఉత్తరం, పడమర, దక్షిణం |
క, ఖ, గ, ఙ | క | దక్షిణం, పడమర |
చ, ఛ, జ, ఝ, ఞ | చ | తూర్పు, పడమర, ఉత్తరం |
ట, ఠ, డ, ఢ. ణ | ట | తూర్పు, ఉత్తరం, పడమర |
త,థ,ద, ధ, న | త | తూర్పు, ఉత్తరం |
ప, ఫ, బ, భ, మ | ప | తూర్పు, ఉత్తరం |
య, ర, ల, వ | య | తూర్పు, దక్షిణం, పడమర |
శ, ష, స, హ | శ | దక్షిణం, తూర్పు |
– కేశవ