నవంబర్ 4 బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా..

-

నిన్న భారీస్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. 04.11.2019 సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా నిలిచింది. దీంతో పది గ్రాముల ధర 40,410 రూపాయల వద్ద ఉంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలోనూ మార్పులేదు. దీంతో 37,050 రూపాయల వద్ద నిలకడగా వుంది. ఇక వెండిధరలూ అలానే ఉన్నాయి.దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 39,000 రూపాయల వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 39,050 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 37,850 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధర కూడా ఎటువంటి మార్పులకు గురికాలేదు. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 39,000 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04.11.2019 సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు.

Read more RELATED
Recommended to you

Latest news