తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది మందిని టీవీకి కట్టిపడేసిన రియాల్టీ షో బిగ్‌బాస్ 3. మా టీవీలో జూలై 21న ప్రారంభమైన బిగ్‌బాస్ 3 105 రోజులు విజయవంతంగా సాగింది. 17మంది కళాకారులతో బిగ్‌బాస్ 3 ప్రారంభమైంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా పనిచేసిన ఈ బిగ్‌బాస్ ఆది నుంచి అంతం వరకు ప్రేక్షకులను అలరించింది. నాగార్జున హోస్టింగ్‌తో బిగ్‌బాస్‌కు భారీ హైప్ క్రియోట్ అయిన నేపథ్యంలో కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించగా, దాదాపుగా 8.5కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.
అయితే చివరి మజిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేత గా నిలిచారు. విన్నర్‌గా నిలిచిన రాహుల్ అండర్‌డాగ్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించి క్రమక్రమంగా బిగ్‌బాస్‌పై పట్టు సాధించారు. అసలు పోటీలోనే లేని రాహుల్ సిప్లిగంజ్ రోజులు గడుస్తున్న కొద్ది గట్టి కంటెస్ట్‌గా రూపుదిద్దుకున్నారు. హైదరాబాద్ పాతబస్తికి చెందిన రాహుల్ హౌస్‌లోను తన పాతబస్తీ భాషతోనే మాట్లాడి అందరిని ఆకట్టుకున్నారు. ప్రేక్షకులను, తనతో పాటు హౌస్‌లో ఉన్న కంటెస్ట్‌లను తన పాటలతో జోష్ నింపారు. అయితే విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ గురించి మనం కొంత తెలుసుకుందా. అసలు రాహుల్ ఎక్కడి నుంచి వచ్చి విజేతగా నిలిచారు. రాహుల్ బిగ్‌బాస్‌కు రాకముందు ఏమీ చేసేవారో చూద్దాం.
రాహుల్ సిప్లిగంజ్ 1980 ఆగస్టు 22న హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేటలో జన్మించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాహుల్ తాను స్వయంకృషితో పాప్‌సింగర్‌గా ఎదిగారు. స్వాతి ఐ లవ్ యూ, మిస్టర్ 420, చిన్నదాన నీకోసం వంటి పాపులర్ మ్యూజిక్ అల్బమ్స్‌ను చేసిన రాహుల్ సిని రంగంలోనూ ప్రవేశించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రికార్డు సృష్టించిన పాట రంగ రంగా రంగస్థలానా అనే పాటను రాహుల్ పాడి తన సత్తాను చూపారు.
ఇక జానపద భాణీలను తీసుకుని పాడిన పాట నీవు పెద్ద పులి నీవు పెద్ద పులి గండికోట గండిమైసమ్మ పాట పాడి ఉర్రూతలూగించారు. ఇక ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్‌గా రామ్ కేరీర్‌లో నిలిచిపోయిన బోనాల పండుగ పాటను పాడిన రాహుల్ తన సత్తాను చాటారు. అనేక సినిమాల్లోనూ తన మాస్ గాత్రంతో, పాతబస్తీ యాసను జోడించి పాడి టాలీవుడ్‌కు హిట్ సాంగ్స్‌ను అందించారు. దీంతో బిగ్‌బాస్ 3 లో కంటెస్టెంట్‌గా ఎంపికైన రాహుల్ తోటి కంటెస్టెంట్ పునర్నవి భూపాలంతో సన్నిహితంగా ఉండి, తనలోని సత్తాకు పదును పెట్టారు. రాహుల్ బిగ్‌బాస్ హౌస్‌లో చేసిన కొన్ని వివాదస్పద పనులతో హోస్ట్ నాగార్జున చేత చివాట్లు తిన్నారు.
ఫలితంగా ఎలిమినేట్ అయి… చివరికి బిగ్‌బాస్ ఇది ఫేక్ ఎలిమినేట్ అని ప్రకటించడంతో రాహుల్ బతుకు జీవుడా అని తిరిగి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒళ్ళు దగ్గరపెట్టుకుని వివాదాలకు దూరంగా ఉంటూనే తనకు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను విజయవంతంగా ముగించి ఫైనలిస్టుగా మొదట స్థానం సంపాదించారు. చివరికి మిగిలిన ఐదుగురు ఫైనలిస్టుల్లోనూ తాను నెంబర్‌వన్‌గా నిలిచి బిగ్‌బాస్ 3 ట్రోపీని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు.