దేశంలో వందేండ్లకు పైబడ్డ డ్యాంలు ఎన్నో తెలుసా?

-

దేశంలో వేలాది డ్యాంలు ఉన్నాయి. ప్రజలకు జీవనాధారలుగా నిలుస్తున్నాయి. అయితే అవి నిర్మించి శతాబ్దాలు గడుస్తున్నాయి. అటువంటి వాటి గురించి లోక్‌సభలో వెల్లడించిన వివరాలు తెలుసుకుందాం…

దేశంలో మొత్తం 5,344 భారీ ఆనకట్టలు ఉండగా అందులో 293 ఆనకట్టలు నిర్మించి సూమారు 100 ఏళ్లకు పైగా గడిచిందని వెల్లడించారు.100 ఏళ్లకు పైబడి ఉన్న భారీ ఆనకట్టలు సూమారు 293 దాకా ఉన్నాయని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ సోమవారం లోక్‌సభకు తెలిపారు. ఆనకట్టల భద్రతకు సంబంధించి బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ బిల్లులో ఆనకట్టలపై కచ్చితమైన పర్యవేక్షణ కోసం జాతీయ ఆనకట్టల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేసి కొన్ని ఎంపిక చేసిన ఆనకట్టల సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. అలాగే ఆనకట్టల భద్రతకు పాటించాల్సిన విధివిధానాలను కూడా ఇందులో పొందుపరుస్తామన్నారు.

293 Big Dams in Country Over 100 Years Old
293 Big Dams in Country Over 100 Years Old

దేశంలో మొత్తం 5,344 భారీ ఆనకట్టలు ఉండగా అందులో 293 ఆనకట్టలు నిర్మించి సూమారు 100 ఏళ్లకు పైగా గడిచిందని వెల్లడించారు. 1,041 ఆనకట్టలు నిర్మించి సూమారు 50 నుంచి 100 ఏళ్ల మధ్యకాలం అయ్యింటుందని పేర్కొన్నారు. వివిధ ఆనకట్టల సంరక్షణ కోసం ఆయా రాష్ర్టాలు తమ పరిధిలో ఉన్న ఆనకట్టలను పరిశీలించి ఒక నివేదికను తయారుచేసి జాతీయ ఆనకట్టల సంరక్షణ కమిటీకి ఇస్తారు. వారు అందుకు అనుగుణంగా ఆనకట్ట సంరక్షణ కోసం చర్యలను తీసుకుంటారు. ఈ తరహా బిల్లును 2018లోనే లోక్‌సభలో ప్రవేశపెట్టగా సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రభుత్వం రద్దవడంతో పాస్ కాలేదు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news