SBI కస్టమర్లకు అలర్ట్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్ పంపింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. మీకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ వుందా..? అయితే మీరు కూడా దీని కోసం తప్పక తెలుసుకోవాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఎస్‌బీఐ తన కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్ పంపింది. పాన్ కార్డును ఆధార్ నెంబర్‌ తో లింక్ చేసుకోవాలని కోరింది. పాన్ నెంబర్‌ను, ఆధార్ నెంబర్‌ను లింక్ చేసుకోవడానికి జూన్ 30 వరకు గడువు ఉంది.

ఈ రెండిటినీ తప్పక లింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు జూన్ 30లోపు పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అది డీయాక్టివేట్ అవుతుంది గమనించండి. దీంతో మీరు జరిమానా కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం రూల్స్ ప్రకారం.. రూ.1000 జరిమానా పడుతుంది.

ఎస్‌బీఐ తాజాగా ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. కాబట్టి కస్టమర్స్ తప్పని సరిగా పాన్ కార్డును ఆధార్‌ తో లింక్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా సులభంగానే పాన్, ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

లేదు అంటే UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిన చాలు.

Read more RELATED
Recommended to you

Latest news