ఈ బ్యాంక్ కస్టమర్స్ కి అలర్ట్…!

-

ఈ మధ్య కాలంలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటివి జారకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. మీకు దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతా వుందా..? అయితే తప్పక మీరు దీని కోసం తెలుసుకోవాలి. లేదు అంటే మీరే నష్ట పోవాల్సి ఉంటుంది. బ్యాంక్ తాజాగా తన కస్టమర్లను అలర్ట్ చేసింది.

hdfc-bank

మోసగాళ్లతో జాగ్రత్త ఉండాలని బ్యాంక్ చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కరోనా మహమ్మారి సమయం లో క్యాష్ బదులు ఆన్‌లైన్ డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు కూడా అదే అనుసరిస్తున్నారు. అయితే దీంతో సైబర్ క్రిమినల్స్‌ కూడా బ్యాంక్ ఖాతాదారులను టార్గెట్ చేయడం జరిగుతోంది.

మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. అందుకే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఖాతాదారులను హెచ్చరించింది బ్యాంక్. అలానే సేఫ్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ గురించి పలు సూచనలు కూడా చేసింది బ్యాంక్. ఎవరు కూడా విలువైన బ్యాంక్ వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోద్దు. మోసగాళ్లు కాల్ చేయొచ్చని కూడా అంది.

లేదంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, టెలికం వర్కర్లు, ప్రభుత్వ అధికారులమని కాల్స్ చేస్తుంటారని. జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ తెలిపింది. కాల్ చేసిన తర్వాత కేవైసీ అప్‌డేట్, కొత్త జాబ్ ఆఫర్లు, అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటూ మోసగాళ్లు చెప్పొచ్చని.. నమ్మొద్దని బ్యాంక్ చెప్పింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ని ఉపయోగించాలని బ్యాంక్ సూచించింది. అలాగే తెలియని పోర్టల్స్‌లో పేమెంట్స్ నిర్వహించొద్దని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version