అమెజాన్ లోగోని ఎందుకు మార్చారంటే…?

-

ఈ-కామర్స్ సంస్థ ఆమెజాన్ లోగోని మార్చింది. ఈ కంపెనీ తన మొబైల్ యాప్ ఐకాన్‌ లోగో లో సీక్రెట్‌గా చిన్న మార్పుని జనవరిలో చేసింది. అయితే అది అందరికీ తెలిసిపోయింది. అంతకు ముందు షాపింగ్ కార్ట్ సింబల్‌ తో లోగో ఉండేది. అందులో ఓ బ్రౌన్ బాక్స్ ఉంటుంది. పైగా దానిపై బ్లూ టేప్ అతికించినట్లుగా ఉంటుంది.

దాని కింద కంపెనీ స్మైల్ షేర్ బాణం ఉంటుంది. ఇలా కంపెనీ మంచిగా ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తుంది అని దీనిని పెట్టారు. కానీ అది సోషల్ మీడియా లో పెద్ద చర్చగా మారింది. అయితే ఈ బ్లూ టేప్ ఒక పెద్ద చిక్కుని తీసుకొచ్చింది. అది అడాల్ఫ్ హిట్లర్ మీసంలా ఉందని నెటిజన్లు కామెంట్ చేశారు. ఇది బాగా వైరల్ అయ్యింది.

దానితో అమెజాన్ దీనిని మార్చాలని అనుకుంది. దీనిని ఎంతో రహస్యంగా మళ్ళీ ఆమెజాన్ బ్లూ టేప్ లోగో లో మార్పులు చేసి… కొత్త లోగోను రిలీజ్ చేసింది. కానీ ఏ ప్రకటన చెయ్యలేదు. కానీ అమెజాన్ మార్చేసింది అని నెటిజన్లు కనిపెట్టేసారు. ఐదేళ్లుగా అమెజాన్ ఆ లోగోను మార్చలేదు. ఇప్పుడు మాత్రం హిట్లర్ పోల్చే సరికి మార్చిల్సి వచ్చి అని అమెజాన్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news