గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అమెజాన్ శుభవార్త..!

-

ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. తాజాగా గ్రామీణ విద్యార్థుల్లో సైన్స్​ పట్ల అవగాహన కల్పించేందుకు అమెజాన్ శ్రీకారం చుట్టింది. గ్రామీణ విద్యార్థుల్లో సైన్స్​ పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం అమెజాన్ తీసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. అమెజాన్​ ఫ్యూచర్ ఇంజనీర్​ (ఏఎఫ్​ఈ) పేరుతో గ్లోబల్​ కంప్యూటర్ సైన్స్​ ఎడ్యుకేషన్​ ప్రోగ్రామ్​ను లాంచ్​ చేసింది.

amazon
amazon

దీని ద్వారా గ్రామీణ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్​ సైన్స్​ విద్యను ఇస్తారు. అదే విధంగా భవిష్యత్తులో వారు మెరుగైన ఉద్యోగావకాశాలు ఇవ్వాలని అమెజాన్ అనుకుంటోంది. ఏడు రాష్ట్రాల్లోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 1 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్​లో అవకాశంని కలిపిస్తారు. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్​ పాఠశాలలను ఎంపిక చేస్తారు.

అమెజాన్​ ఫ్యూచర్​​ ఇంజనీర్​ కార్యక్రమంలో 6 నుంచి 12 తరగతి విద్యార్థులకు సైన్స్​ ఎడ్యుకేషన్​పై బోధన ఉంటుంది. అలానే కోడింగ్, మెషిన్​ లెర్నింగ్​, నేచురల్​ లాంగ్వేజ్​లాంటివి బోధిస్తారు. ఇది ఇలా ఉంటే మరోవైపు అమెజాన్​ సైబర్​ రోబోటిక్స్​ ఛాలెంజ్​ కార్యక్రమం ద్వారా ప్రోగ్రామింగ్​ బేసిక్స్, కోడింగ్​ నేర్చుకో వచ్చు.

భారత గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్​ సైన్స్ నేర్పించేందుకు అంతర్జాతీయ నాలెడ్జ్​ పార్ట్​నర్​ కోడ్.ఓఆర్​జీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అమెజాన్​ పనిచేస్తోంది. అయితే నేటి ఉపాధి రంగంలో కంప్యూటర్​ సైన్స్​ కీలకంగా మారింది. అందుకే కంప్యూటర్​ సైన్స్​పై పాఠశాల స్థాయిలోనే పట్టు సాధించడం అవసరమని అమెజాన్​ ఇండియా హెడ్​ అమిత్​ అగర్వాల్ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news