టిడిపిపార్టీని వీడి.. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎల్. రమణ చేరడంపై టిటిడిపి స్పందించింది. టిటిడిపి ఇంచార్జ్ నాయుడు దీనిపై మాట్లాడుతూ.. టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్. రమణకు టపాకాయలు కాల్చుతూ మా పార్టీ నేతలు వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎల్. రమణను కాకుండా.. ఐరన్ లెగ్ రమణను కేసీఆర్ తన..పార్టీలో చేర్చుకున్నాడని ఎద్దేవా చేశారు.
ఏడేళ్లుగా టిడిపికి పట్టిన శని నేటితో వదిలిపోయిందన్నారు. రమణ వెళ్లిపోయినందుకు టిడిపి శ్రేణులు ఉత్సవాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నూతన నాయకత్వంలో భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం అవుతుందని.. రమణ వెళ్లిపోవడం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి శుభసూచకమని స్పష్టం చేశారు. కాగా కాగా టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపారు. 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు మరో రెండు లేదా మూడు రోజుల్లో అనుచరులతో కలిసి టిఆర్ఎస్ లో చేరుతానని వెల్లడించారు ఎల్ రమణ.