మీకు 18 ఏళ్లు దాటాయా? ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5,000 పెన్షన్

-

అటల్ పెన్షన్ యోజన స్కీం… కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం 18 ఏళ్ళు దాటిన అందరికి ఈ పథకం వర్తిస్తుంది. ఒకసారి ఈ స్కీం లాభాలు ఏంటి అనేది చూద్దాం… 

అటల్ పెన్షన్ యోజన… కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్ ఇది. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా పెన్షన్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-PFRDA నిర్వహిస్తుంది.

పౌరులకు కనీస పెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ సర్కార్ ఈ పథకానికి రూప కల్పన చేసింది. ఈ స్కీమ్‌లో చేరాలంటే వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది. వారికి బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ ఖాతా ఉండాలి. ఈ స్కీమ్‌లో ప్రతీ నెల లేదా మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి డబ్బులు జమ చెయ్యాలి.

ఏ వయస్సులో స్కీమ్‌లో చేరినా 60 ఏళ్ల వరకు పొదుపు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మీకు ప్రతీ నెలా పెన్షన్ మీ ఖాతాలో పడుతుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరినవారికి ఆదాయపు పన్ను చట్టంలోని 80 సీసీడీ (1) కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.

జమ చేయాల్సిన మొత్తం లబ్ధిదారుల వయస్సు, పొందాలనుకునే పెన్షన్‌పై ఆధారపడుతుంది. మీ పోదుపుని బట్టి నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

ఓ వ్యక్తి 18 ఏళ్ల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 పెన్షన్ పొందేందుకు నెలకు రూ.42 జమ చెయ్యాల్సి ఉంటుంది. అదే రూ.5,000 పెన్షన్ పొందాలంటే రూ.210 జమ చేయాలి. ఈ స్కీమ్‌లో చేరడానికి గరిష్ట వయస్సు 40 ఏళ్లు గా ఉంది.

40 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరితే రూ.1,000 పెన్షన్ కోసం నెలకు రూ.291 పొందుపు చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ రూ.5,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.1,454 జమ చెయ్యాలి. అందుకే ఈ స్కీమ్‌లో చేరే ముందు మీకు 60 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ కావాలనుకుంటున్నారో మీకు ముందే అవగాహన ఉండాల్సి ఉంటుంది.

నెలనెలా పెన్షన్‌తో పాటు దురదృష్టవ శాత్తు లబ్ధిదారుడు మరణిస్తే నామినీకి లభించే పెన్షన్ కార్పస్ వివరాలు; రూ.1,000 పెన్షన్ పొందేవారికి రూ.1,70,000, రూ.2,000 పెన్షన్ పొందేవారికి రూ.3,40,000, రూ.3,000 పెన్షన్ పొందేవారికి రూ.5,10,000, రూ.4,000 పెన్షన్ పొందేవారికి రూ.6,80,000, రూ.5,000 పెన్షన్ పొందేవారికి రూ.8,50,000 లభిస్తాయి.

ఆలస్యంగా చెల్లిస్తే నెలకు ప్రతీ వందకు రూ.1 జరిమానా ఉంటుంది. పథకాన్ని మధ్యలో నిలిపేసినవాళ్లు పెనాల్టీ చెల్లించి రెన్యువల్ చేసుకునే సదుపాయం ఉంటుంది. పథకాన్ని మధ్యలో ఆపెయ్యాలనుకుంటే అకౌంట్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించి జమ చేసిన మొత్తాన్ని పొందే సదుపాయం ఉంది.

ఈ స్కీమ్‌లో చేరినవాళ్లు 60 ఏళ్ల లోపు చనిపోతే జీవిత భాగస్వామి అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌ను కొనసాగించే సదుపాయం ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ చనిపోతే నామినీకి పెన్షన్ కార్పస్ లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news