స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..!

-

దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది నిజంగా కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. హోమ్ లోన్స్ ‌పై వడ్డీ రేట్లను స్టేట్ బ్యాంక్ పెంచేసింది. దీంతో బ్యాంక్‌ లో హోమ్ లోన్ తీసుకుంటే ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. రుణ రేట్లు పెంచి రుణ గ్రహీతలకు షాకిచ్చింది ఎస్బీఐ. ఈ నిర్ణయం తో చాల మందికి ప్రతికూల ప్రభావం పడనుంది.

ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 6.95 శాతం నుంచి ప్రారంభమౌతాయని పేర్కొంది. ఇది ఇలా ఉంటే స్టేట్ బ్యాంక్ ఇది వరకు 6.7 శాతం వడ్డీకే హోమ్ లోన్ రుణాలు అందించింది. ఏది ఏమైనా రుణ గ్రహీతలకు కష్టమే.

గతం తో పోలిస్తే ఇప్పుడు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌ మార్క్ లింక్డ్ రేటుకు EBLR 40 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ తో హోమ్ లోన్స్ లభిస్తాయి.

ఈబీఎల్ఆర్ అనేది రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ఈబీఎల్ఆర్ ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. దీనితో హోమ్ లోన్స్‌ దాదాపు 7 శాతం వడ్డీ రేటుతో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. అయితే మహిళలకు మాత్రం 5 బేసిస్ పాయింట్ల మేర తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news