ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఏకంగా మూడు లక్షల నష్టం..!

ప్రభుత్వ ఉద్యోగుల కు (Government Employees) గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. నిలుపుదల చేసిన డీఏ బకాయిలను జూలై నుంచి చెల్లించనుంది. దీంతో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుతాయి అన్న సంగతి మనకి తెలిసినదే. కానీ ఉద్యోగులకు డీఏ నిలుపుదల కారణంగా రూ.3 లక్షల వరకు నష్టం కలిగింది.

గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఉద్యోగులకు డీఏ పెంచలేదు. 2020 జనవరి 1న, 2020 జూలై 1న డియర్‌నెస్ అలవెన్స్ పెంపు లేదు. 2021 జనవరి 1న కూడా పెంచలేదు. ఉద్యోగులకు, పెన్షనర్లకు 3 ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ అందలేదు. అలానే ఎరియర్స్ కూడా లేవు. ఏది ఏమైనా 18 నెలలుగా ఉద్యోగులకు డీఏ పెంపు లేదని చెప్పుకోవాలి.

10 వేల బ్రాకెట్‌ లో గ్రేడ్‌ శాలరీ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ 18 నెలల లో రూ.2.88 లక్షల వరకు నష్ట పోయారు. వీరికి డీఏ 2020 జనవరి 1 నుంచి జూన్ వరకు రూ.34608 నుంచి రూ.52368కు పెరుగుతుంది.

ఆ తర్వాత ఆరు నెలలకు డీఏ అంటే 2020 డిసెంబర్ చివరి వరకు చూస్తే రూ.60564 నుంచి రూ.91644కు చేరుతుంది. 2021 జనవరి నుంచి జూన్ చివరి వరకు మళ్లీ డీఏ రూ.95172 నుంచి రూ.144012 అవుతుంది.

ఇవి అన్ని చూస్తుంటే 18 నెలల కాలం లో ఉద్యోగులకు రూ.2.88 లక్షలు నష్ట పోయారు అనే చెప్పాలి. జూలై నుంచి ఉద్యోగులకు 28 శాతం డీఏ లభించవచ్చు. అయితే ఇది ఇప్పుడు 17 శాతంగా ఉంది.